హైదరాబాద్‌లో మరోమారు డ్రగ్స్ కలకలం
భారీగా సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్,ఆగస్ట్13(జనం సాక్షి): హైదరాబాద్ నగరంలో మారోమారు డ్రగ్స్ కలకలం రేపింది. భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దీనిని సరఫరా చేస్తున్న వ్యక్తిని ఆబ్కారీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అబ్దుల్ హావిూద్ నుంచి 31 గ్రాముల కొకైన్, రూ. 7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో హావిూద్ డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు అధికారులు నిర్దారించారు. నిందితుడు హైదరాబాద్‌లో ప్రయివేటు ట్రావెల్స్ నడుపుతున్నాడు. డ్రగ్స్‌ను గోవా నుంచి హైదరాబాద్‌కు హావిూద్ తరలిస్తున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. నిందితుడు హావిూద్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


