హోంమంత్రిని కలిసిన సూరారం వీకర్స్ సెక్షన్ వాసులు
శ్రీనగర్ కాలనీ: గత 16ఏళ్ల పైన తాము ఉంటున్న నివాసాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరుతూ సూరారం కాలనీ వాసులు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డికి వినతి పత్రం అందించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని హోంమంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ తెలిపారు.