అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
సురవరం విజయలక్ష్మి ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి సురవరం విజయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం దేవరకొండ లోని వైష్ణవి ఫంక్షన్ హాల్లో జరిగిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నలగొండ జిల్లా ఆరవ మహాసభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆన్లైన్ విధానం పేరుతో పని భారం మరింత పెంచడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ను 40ఏళ్ల నుంచి గౌరవ వేతనంతో పేరుతో పనిచేపిస్తు అటు ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా,ఇటు కార్మికులు కాకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నారని అన్నారు.
గత ఐదు సంవత్సరాలుగా టీ ఏ. డి ఏ బిల్లులు ఇవ్వటం లేదు అని అన్నారు. ఇంటి అద్దెలు,వంట గ్యాస్ ,ఆరోగ్య లక్ష్మి బిల్స్ ఈవెంట్స్ బిల్స్ సక్రమంగా ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది అని అన్నారు . కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ప్రతి సంవత్సరం ఆ శాఖకు నిధుల కేటాయింపుల్లో కోత విధిస్తుందని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 24000 ఇవ్వాలని కోరారు.
విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్స్ ను మెయిన్ సెంటర్ గా చెయ్యాలనీ ,సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు గ్రాట్యుటీ వెంటనే వర్తింపజేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నండూరి కరుణ కుమారి మాట్లాడుతూ అంగన్వాడీలపై రోజురోజుకు పని భారం పెరిగిపోతుందని ఆన్లైన్ పేరుతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గ్యాస్ ధరలు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని వాటికనుగుణంగా బిల్లు పెంచాలని కోరారు. చనిపోయిన అంగన్వాడీ టీచర్, ఆయా స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కోరారు. అంగన్వాడి లపై వేధింపులు అరికట్టాలని బిఎల్ఓ డ్యూటీ రద్దు చేయాలని ఆమె కోరారు.
ఈ మహాసభ లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యూనియన్ గౌరవ అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు యడమా సుమతి ,కార్యదర్శి జయ ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చలం పాండురంగారావు ఉపాధ్యక్షురాలు రమాదేవి, శాంత కుమారి,కోట్ల శోభ ,మనెమ్మ, సంతోష,ఎన్ విజయ.అంజలి,బి.జ్యోతి, మాణిక్యమ్మ, కే రాధిక, వెంకటమ్మ,కవిత సుజాత,ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షులు వి గణేశ్ జలూరి వెంకట్రాములు,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు