అంగన్వాడీ కేంద్రంల నిర్వహణ అస్తవ్యస్తం

అంగన్వాడీ కేంద్రంల నిర్వహణ అస్తవ్యస్తం

ఏటూరు నాగారం,
అక్టోబర్12(జనంసాక్షి).
మండల కేంద్రంలోని మానసపల్లి ఎస్సీ దళిత కాలనీలోని అంగన్వాడి కేంద్రం నిర్వహణ తీరు గత ఏడాది కాలంగా పేరుకే నామమాత్రంగా నిర్వహణ జరుగుతుంది. దళిత కాలనీ కావడంతో అంగన్వాడీ టీచర్, ఆయాలు డుమ్మా కొడుతున్నప్పటికీ స్థానిక అంగన్వాడి సూపర్వైజర్, సిడిపిఓ లకు విషయం తెలిసినప్పటికీ ఏ ఒక్క రోజు కూడా అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన దాఖలాలు లేవని గ్రామస్తులు వాపోతున్నారు. గత కొన్ని నెలలుగా విధులకు డుమ్మా కొడుతున్న అంగన్వాడి సిబ్బంది హాజరు రిజిస్టర్ లో సంతకాలు పెట్టుకొని యాదేచ్ఛగా ప్రతినెల వేతనాలు పొందుతూన్నారు. పర్యవేక్షణ చేయాల్సిన అధికార యంత్రాంగం ముడుపులు తీసుకొని విధులకు డుమ్మా కొడుతున్న వారిని కాపాడుతున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అంగన్ వాడి కేంద్రాలకు పిల్లలకు,గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పంపిణీ చేయాల్సిన పౌష్టిగా ఆహారాన్ని సైతం బ్లాక్ మార్కెట్ కు తరలించి అందిన కాడికి దోచుకుంటున్నారని. గ్రామస్తులు వాపోతున్నారు. దళిత కాలనీలో విధులకు హాజరు కాకపోయినా, పౌష్టిక ఆహారం బ్లాక్ మార్కెట్ కి తరలించి అమ్ముకున్న తమను అడిగే వారు లేరు అనే ఇష్టానుసారంగా కేంద్రం నిర్వహణ ఉండడంతో మానసపల్లి అంగన్వాడి కేంద్రం తీరు వివాదాస్పదంగా మారింది.
దీంతో స్థానిక అధికారులు తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా సదురు అంగన్ వాడి టీచర్ ఈ మధ్యకాలంలో లాంగ్ లీవ్ పెట్టినట్లు సమాచారం. ఆయా స్థానంలో ఒకరికి బదులు మరొకరు విధులు నిర్వహిస్తున్నారు. అంగన్ వాడి కేంద్రం ఇన్చార్జిగా పక్కన ఉన్న అంగన్వాడి కేంద్రం టీచర్ భవానికి బాధ్యతలు అప్పగించారు. కేంద్రంలో నిల్వ ఉన్న కోడి గుడ్లు బాలింతలకు అందించారు. అట్టి కోడిగుడ్లు తిన్న బాలింతలు వాంతులు. విరోచనాలతో తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు తమకు ఇచ్చిన పాడైపోయిన కోడిగుడ్లు. తీసుకువచ్చి అంగన్వాడి కేంద్రం వద్ద ధ్వంసం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం పర్యవేక్షణ చేయవలసినటువంటి అధికారులు పత్తా లేకుండా పోయారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ చేపట్టి ఏడాదికాలంగా విధులకు డుమ్మా కొడుతున్న అంగన్వాడి సిబ్బందిని తొలగించాలి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని అన్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఇన్చార్జిగా ఉన్న అంగన్వాడీ టీచర్ భవాని, సూపర్వైజర్ ఆఫ్రిన్ లు కేంద్రాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.