అంగన్వాడీ, హెల్పర్లకు రాష్టంలో పెద్దపిట వేసినా ముఖ్య మంత్రి కె సి ఆర్…. మంత్రి

–తెలంగాణ అంగన్ వాడి టీచర్లు, హెల్పర్ల పరకాల మహా సభ పరకాల లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
హన్మకొండ బ్యూరో 28 ఆగస్టు జనంసాక్షి
తెలంగాణ రాష్ట్రము సాధించిన తరువాత రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లు దేశం లొ ఎక్కడ లేనివిదంగా జీతాలు ఇస్తున్నారు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు,ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పరకాల మహాసభ, పరకాలలోని ఎమ్మెల్యే కార్యాలయం లొ ఆయన మాట్లాడుతూ
తెలంగాణ వచ్చాకే అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు  మర్యాదలు, వేతనాలు పెరిగాయి అన్నారు
వర్కర్లు, ఆయాలను టీచర్లు, హెల్పర్స్ గా పిలుస్తున్నాం. ఆ రకంగా మీకు గౌరవం పెరిగింది అని తెలిపారు
మిమ్మల్ని ఎంత కాపాడుకున్నా తక్కువే..
మొదటగా అంగన్ వాడీ లను 1975 లో ఏర్పాటు చేశారన్నారు
సమగ్ర శిశు అభివృద్ధి లో భాగంగా దశలవారీగా దేశవ్యాప్తంగా,అంగన్‌వాడీ అనేది గ్రామీణ పిల్లల సంరక్షణ కేంద్రం. పిల్లల ఆకలి తీర్చడంతో పాటు, పోషకాహారాన్ని అందించడం అంగన్ వాడి ల ప్రధాన విధి.
అంతేకాకుండా అంగన్ వాడీ అంటే, ఆశ్రయం కల్పించే కేంద్రం అని అర్థం తెలిపారు
మొదట అంగన్ వాడీ లకు 100 రూపాయల లోపు గౌరవ వేతనం ఉండేది.కానీ
తర్వాత అది అయిదు, పది, ఆ తర్వాత వంద, రెండు వందల చొప్పున కొద్దికొద్దిగా పెరిగింది
ఆనాడు వేతనాలు పెంచ‌మ‌ని అడిగితే, అంగన్వాడీల‌ను గుర్రాలతో తొక్కించారు అని తెలిపారు,మహిళలని చూడకుండా లాఠీ ఛార్జి చేయించారు, తెలంగాణ వ‌చ్చాకే అంగ‌న్ వాడీల‌కు గౌర‌వ మ‌ర్యాద‌లు దక్కాయన్నారు,అంగ‌న్ వాడీల‌ను అంగ‌న్ వాడీ టీచ‌ర్లు అని, వారి స‌హాయ‌కుల‌ను హెల్ప‌ర్ల‌ని గౌర‌విస్తున్నాం.తెలంగాణ వచ్చిన తర్వాత ఇవ్వాళ అంగన్వాడి ల జీతం ఎంత? 13 వేల 659 రూపాయలు
దేశంలో ఎక్కడా ఇంత పెద్ద మొత్తంలో జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు,ఢిల్లీ, కేరళలో 10 వేలు ఇస్తుంటే, మన పక్కనే ఉన్న ఏపీ లో కేవలం 7 వేలు మాత్రమే ఇస్తున్నారు.
హెల్పర్ల జీతాలు 5 లేదా 6 వేలకు మించడం లేదు.
బీజేపీ పాలిత గుజరాత్ లో 7వేల 800 ఉండగా, ఉత్తరప్రదేశ్ లో 8 వేలు ఇస్తున్నారు,కేంద్రం ఇచ్చే గౌరవ వేతనంతో పనిలేకుండా మన సీఎం కెసిఅర్ గారు వేతనాలు పెంచారు.అరకొర సౌకర్యాలు, అగౌరవంగా నడిచే అంగన్వాడి లను పక్కా భవనాలు, స్కూల్స్ లోకి మార్చి మరింత గౌరవం పెంచాలని సీఎం కెసిఆర్ ఆలోచిస్తున్నారు,తెలంగాణ వస్టే ఏమొస్తది అన్నోళ్లకు సమాధానమే మా అడ పడచులు ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు. ప్రతి ఒక్క మహిళ.అన్నారు ఈ మహాసభలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి, జయశంకర్ భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ zp చైర్ పర్సన్ గండ్ర జ్యోతి,  టీఆరెఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు, అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, నియోజకవర్గం వ్యాప్త అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు