అంగన్‌వాడీ వేతనాలు విడుదల చేయాలి
ఖమ్మం, అక్టోబర్ 25 : అంగన్‌వాడీ సిబ్బంది వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి. మణి, సిహెచ్ సితాలక్ష్మీ డిమాండ్ చేశారు. ఈ నెల 17న శాసనమండలి సభ్యులు చంద్రశేఖర్ నేతృత్వంలో మంత్రి సునితా లక్ష్మారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. నాలుగు నెలల వేతనాలు ఖజనాకు చేరక పోవడంతో సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం బ్యాంకు ఖాతాలకు తమ జీతాలు జమ చేయాలని కోరారు.