అంగరంగ వైభవంగా ఎంగిలిపువ్వు బతుకమ్మ….
-తీరొక్క పూలతో.. బతుకమ్మలు పేర్చిన మహిళలు…
– ఆట..పాటలతో అలరించిన ఆడపడుచులు…
ప్రభత్వ జూనియర్ కళాశాల, ఎన్ ఎస్ పి క్యాంపు, రెడ్డి కాలనీ రామాలయం, వాసవీ కన్యాకాపరమేశ్వరి దేవాలయం,గీతా మందిరం,బోటింగ్ పార్క్,కనకదుర్గ ఆలయ ప్రాంగణంలో…
-భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళ నాయకులు….
-పోలీస్ బందోబస్త్ ల నడుమ
మిర్యాలగూడ, జనం సాక్షి
ఎంగిలి పువ్వు బతుకమ్మను ఆదివారం అంగరంగవైభవంగా..ఘనంగా నిర్వహించారు…
ఉదయం 8 గంటల వరకే తీరొక్క పూలతో అక్కడికి విచ్చేసిన మహిళలు… అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా.. బతుకమ్మలు పేర్చారు.. తంగేడు పువ్వు జిల్లేడు పువ్వు గునుగు పువ్వు బంతి చామంతి తీరొక్క పూలతో.. అందంగా బతుకమ్మలు పేర్చి అందులో పసుపు గౌరమ్మను ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు..
అనంతరం… బతుకమ్మ పాటలకు
లయబద్ధంగా నృత్యాలు చేస్తూ కోలాటాలు వేస్తూ .. అత్యంత ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలలో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్. నాగలక్ష్మి, ఎం పి పి నూకల సరళ హన్మంత్ రెడ్డి.ఎ డి ఎ పోరెడ్డి నాగమణి,ఎం పి డి ఓ. గార్లపాటి జ్యోతి లక్ష్మి. మహిళా కౌన్సిలర్లు,పాలుపంచుకున్నారు