అంగరంగ వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం
పినపాక నియోజకవర్గం అక్టోబర్ 02 (జనం సాక్షి): శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శ్రీ సరస్వతి దేవి అలంకరణ (మూల నక్షత్రం) సందర్భంగా శ్రీశ్రీశ్రీ పంచముఖ వేద గాయత్రి మాత ఆలయంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దయానిధి అక్కినేపల్లి వసంతాచార్యులు,ఆలయ అర్చకులు అక్కినేపల్లి ప్రదీప్ శాస్త్రి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాసములు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పుష్పార్చన కుంకుమార్చనలతో వైభవంగా పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.