అండన్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
యూకె నలుమూలల నుంచి 600 కుటటుంబాల రాక
లండన్,అక్టోబర్11 (జనం సాక్షి) : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ సంబురాలకు యూకే నలుమూలల నుంచి ఆరువందలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, స్థానిక హౌంస్లౌ మేయర్ బిష్ణు గురుగ్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అదే స్ఫూర్తితో రాష్ట్ర మంత్రి కేటీఆర్ కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతి సంవత్సరం లాగా నేడు కూడా వేడుకలను ’చేనేత బతుకమ్మ` దసరా’ గా జరుపుకున్నామని సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.
ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో
ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందన్నారు. టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు.
ªూర్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి సత్యమూర్తి చిలుముల, ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు, టాక్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి, టాక్ ప్రధాన కార్యదర్శులు సురేష్ బుడగం ? జాహ్నవి దూసరి, అడ్వైజరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, కమ్మూనిటీ అ్గªర్స్ చైర్మన్ నవీన్ రెడ్డి, సభ్యులు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల, మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి, గణెళిష్ పాస్తం, రాకేష్ పటేల్, రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, నవీన్ భువనగిరి, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, జితేందర్ రెడ్డి బీరం, విజితా రెడ్డి, శ్రీ విద్య, వంశీ పొన్నం, వేణు నక్కిరెడ్డి, హరి గౌడ్ నవాబ్ పేట్, రాజేష్ వర్మ, శ్రీకాంత్ జెల్లా, క్రాంతి రేటినేని, మమత జక్కీ, శ్వేతా మహేందర్, శైలజ, ప్రియాంక రెడ్డి, సృజన, మౌనిక, అవినాష్, భూషణ్, శశి, పృథ్వీ, ప్రశాంత్ మామిడాల, శ్రీకాంత్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.