అంతరాష్ట్ర వ్యవసాయ విజ్ఞానయాత్రకు జిల్లా రైతులు

శ్రీకాకుళం, జూలై 30 : వ్యవసాయ సాంకేతిక యాజమాన్యసంస్థ(ఆత్మ) ద్వారా జిల్లా నుంచి 33 మంది రైతులను వ్యవసాయ విజ్ఞానయాత్రకు పంపిస్తున్నట్లు ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.రామారావు తెలిపారు. మహరాష్ట్రలోని నాగపూర్‌లో గోవిజ్ఞాన అనుసంధాన కేంద్రం, ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పరిశోధనా కేంద్రాలకు సేంద్రియ వ్యవసాయం, జీరో బడ్జెట్‌ వ్యవసాయంపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు లక్ష్మీనారాయణ, భవానీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.