అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు

1

న్యూఢిల్లీ,జనవరి17(జనంసాక్షి):నారింజ రంగులో అందంగా ఉన్న ఈ జినియా పువ్వు చూశారా? ఇది అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఈ పూలు పూయించారు. అంతరిక్షంలో పంటలు పండించేందుకు నాసాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జినియా విత్తనాలను నాటారు. వారి ప్రయత్నం ఫలించి తొలిసారిగా అంతరిక్షంలో మొక్క మొలిచింది… పెరిగి పుష్పించింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్త స్కాట్‌ విల్లీ అంతరిక్షం నుంచి ట్వీట్‌ చేశారు. అంతరిక్షంలోని హైడ్రోపోనిక్‌ వెజీ ల్యాబ్‌లో సున్నా గ్రావిటీలో ఈ మొక్కను పెంచారు. అమెరికాకు చెందిన ఈ జినియా పూలను ఆహారంగా తీసుకునే సలాడ్‌లలో ఉపయోగిస్తారు. కాగా.. ఈ పువ్వు పూయడంతో మరిన్ని కూరగాయల మొక్కలు నాటేందుకు అవకాశం దొరికినట్లయింది.