‘అంతరిక్ష ఆవాసం ‘ పోటీలో రవీంద్రభారతి పాఠశాల విద్యార్థుల ప్రతిభ

విశాఖపట్నం : అమెరికాలోని నాసా సంస్థ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘అంతరిక్ష అవాసం ‘ ప్రోజెక్టు పోటీలో రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులు వరుసగా అయిదోసారి బహుమతుల పంట పండించారని రవీంద్రభారతి ఈఎం పాఠశాల ప్రిన్సపల్‌ టి. శ్రీదేవి తెలిపారు. రాష్ట్రంలో విశాఖ. నెల్లూరు . తిరుపతి . హైదరాబాద్‌ నగరాల్లోని రవీంద్ర భారతి విద్యాసంస్థలకు  చెందిన విద్యార్థులు రూపొందించిన ఆరు ప్రాజెక్టులకు అంతర్జాతీయ పోటీలో బహామతులు దక్కాయి. మొత్తం అంతర్జాతీయ స్థాయిలో 1500 మంది విద్యార్థులతో పోటీపడి రవీంద్రభారతి విద్యార్థులు ఈ బహామతులను సాధించారు. వీరు రూపొందించిన ‘ఆరోనియన్‌ ప్రాజెక్టుకు మొదటి మహామతి లభించింది. అమెరికాలోని కేలిఫోర్నియా, శాండిగోలో నిర్వహించనున్న 32వ అంతర్జాతీయ అభివృద్ధి సస్సు 2013 లో రవీంద్ర భారతి విద్యాసంస్థలకు చెందిన 30మంది విద్యార్థులు ఈ బహామతులను అందుకోనున్నారు.