అంతర్గత భద్రతకు కలిసి పోరాడుదాం: ఒబామా, జిన్‌పింగ్
కాలిఫోర్నియా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మద్య జరిగిన భేటీలో ఇరు దేశాలు సైబర్ భద్రతపై కలిసి పోరాడేందుకు ఒప్పందం చేసుకున్నారు. దక్షిణ కాలిఫోర్నియాలోని డెసెర్ట్ ఎస్టేట్ లో వీరు సమావేశమయ్యారు. మార్చిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక తొలిసారి జిన్‌పింగ్ అమెరికా వచ్చారు. రెండు రోజులపాటు సాగే ఈ సమావేశంలో ముఖ్యంగా సైబర్ భద్రత, మేథోహక్కుల గురించి చర్చించనున్నారు.