అంతర్జాలమే.. అర్హతలు.. వెతికి మరీ వైద్యం!?

– అమాయకులే పెట్టుబడి.. మెడికల్ షాపులే అడ్డా..
– ప్రథమ చికిత్సలా.. ప్రయోగ చికిత్సలా..?
– రోగులను పట్టిపీడిస్తున్న వైద్యులు.
– వచ్చిరాని వైద్యం.. ప్రాణాలతో చెలగాటం.
– రక్త పరీక్ష కేంద్రాలే.. వైద్యశాలలు..
– నిబంధనలేవి వారికి వర్తించవు.
– శంకర్ దాదా ఎంబిబిఎస్ లే..
– ఉదాసీనంగా అధికారులు.
డోర్నకల్ ఆగస్టు 30 జనం సాక్షి
పట్టణంలో పుట్టగొడుగులా ఆస్పత్రులు,మెడికల్ షాపులు,రక్త పరీక్షా కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. ఈ మూడు విభాగాలు ఒకే గొడుగు కింది కమిషన్ల కథ నడిపిస్తున్నాయి.ధనార్జనే ధ్యేయం.. అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా కొందరు వైద్యం పేరుతో దందా సాగిస్తున్నారు.కనీస ప్రమాణాలు పాటించని”ఆర్ఎంపీ డాక్టర్లు,రక్త పరీక్షశాలు,మందుల దుకాణాల వైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదు.మౌలిక ఫిర్యాదు అందితే తప్ప తనిఖీలకు కదలడం లేదు.అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంలో ఆంతర్యం ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.నానాటికి వైద్యుల డిమాండ్ పెరుగుతున్న మన సర్కార్ దావఖానాలో డాక్టర్ల సంఖ్య పెరగడం లేదు.సంధ్య వేళ నుంచి ఉషోదయం వరకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులే డాక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.రాత్రివేళలో సరైన వైద్యం అందక అనేకమంది మృత్యువాత పడ్డ దాఖలాలు ఉన్నాయి.మున్సిపాలిటీకి బస్తి దావకానలు లేకపోవడం ఆర్ఎంపీలకు వరంగా మారింది.గతంలో ఊరుకో ఆర్ఎంపి ఉండేవారు.ప్రస్తుతం ఇబ్బడి ముబ్బడిగా ఉన్నారు.క్వాలిఫైడ్ డాక్టర్లు మాత్రం పది ఊర్లకు ఒక్కరు కూడా ఉండటం లేదు.గతంలో ఆర్ఎంపీలు మానవత్వంతో సేవలందించేవారు.ప్రస్తుతం కొందరి కన్సల్టెన్సీ ప్లీజ్ 100,ఇంజక్షన్ రూ.50 నుంచి150,గ్లూకోజ్ రూ.300 లు గుంజుతున్నారు.అసలు సెలైన్లు, ఇంజక్షన్లు,యాంటీబయాటిక్ మాత్రలు ఇవ్వకూడదని వైద్యారోగ్య శాఖ ఖచ్చితమైన నిబంధనలు ఉన్న అవేవీ తమకు వర్తించవన్నట్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎంబిబిఎస్ లను మించి వైద్యం చేస్తున్నారు.రక్త పరీక్షలు,ఎక్సరేలు,ఈసీజీలు అన్నిటికీ వారే నిపుణులు.ఆపరేషన్లలు సైతం చేసినట్లు విషయం వినిపిస్తుంది.కొందరి రోగులను ఖమ్మం-వరంగల్ ప్రైవేట్ హాస్పటల్ లకు పంపించి వేలలో పర్సంటేజీలు అందుకుంటున్నారు.ఇవే కాకుండా ఏడాదిలో రెండు సార్లు సమ్మిట్లు పెట్టి ఆకర్షణీయమైన బహుమతులు అందించి ఆర్ఎంపీలను తమ వైపు తిప్పుకుంటున్నారు కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు.ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్ఎంపీ డాక్టర్లు సహకరించకపోతే ఖరీదైన చదువు,కష్టపడి చదివిన వైద్యులు,డయాగ్నిక్ సెంటర్లు మిణుకు,మిణుకుమని ఎదురు చూడవలసిందే.అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ కుదేలైతే చెప్పడంలో అతిశక్తి లేదు.తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఖమ్మంలోనే అత్యధికంగా ప్రైవేటు దావకానాలు ఉన్నవి.అధిక శాతం ఆసుపత్రులకు ఆయుపట్టు ఆర్ఎంపీలే.అంతలా ప్రభావితమయ్యారు గ్రామీణ వైద్యులు.కొందరు మిడిమిడి జ్ఞానంతో అంతర్జాలంలో వెతికి వైద్యం చేస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు.ఇలాంటి వారిపై అధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేస్తున్నారు.కరోనాతో కకవికలమైన సమాజానికి మానవత్వంతో వైద్యులు సేవలందిస్తుంటే కొందరు కంత్రిగాళ్లు వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారు.కమిషన్ల కక్కుర్తికి అమాయకులను ఆర్థికంగాను,ఆరోగ్యంగాను నష్టపరుస్తున్నారు.రోగులకు
అధిక మోతాదు యాంటీబటిక్స్ ఇచ్చి తాత్కాలికంగా ఉపశమనం లభించిన కిడ్నీ,లివర్,గుండె,ఊపిరితిత్తులపై ప్రభావం చూపి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతున్నారు. ఆస్తుల అమ్ముకొని అప్పుల పాలవుతున్నారు.
ఈ ధన దోపిడీ నుంచి ప్రజలను రక్షించుటకు స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.మండల ప్రాథమిక ఆరోగ్య దావకాన నందు 24 గంటల సేవలకు వైద్యుల నియామకం,బస్తీ దావకానలు ఏర్పాట్ల పట్టణ ప్రజలకు మేలు చేసే అత్యంత ప్రధాన అంశాలు.శాసనసభ్యులు రెడ్యానాయక్ దృష్టికి తీసుకువెళ్లి నియామకం,ఏర్పాటు జరపాలని ప్రజలు కోరుతున్నారు.ప్రజ ఆర్థిక,ఆరోగ్యాల దృష్ట్యా స్థానిక పాలకులు ఏ మేరకు సక్సెస్ అవుతారో.. వేచి చూడాలని ప్రజలు అనుకుంటున్నారు.