అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్టు

హైదరాబాద్‌,ఆగస్టు30 : దృష్టి మరల్చి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలోని ఏడుగురు సభ్యులను అప్జల్‌గంజ్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.40వేల నగదు, 5 మొబైల్‌ ఫోన్లు, ఓ డెబిట్‌ కార్డు, గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అప్జల్‌గంజ్‌ సీఐ పీజీ రెడ్డి తెలిపారు. ఈ నెల 22న సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రవీంద్ర అనే వ్యాపారి అప్జల్‌గంజ్‌ ప్రాంతంలో నగదు బ్యాగ్‌తో నడుచుకుంటూ

వెళ్తుండగా ఈ ముఠా సభ్యులు దృష్టి మరల్చి దోపిడీకి పాల్పడ్డాడు. దీంతో బాధితుడు అప్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని వెల్లడించారు. త్వరలో జరగబోయే గణెళిష్‌ నిమజ్జనం సందర్భంగా దోపిడీలకు పాల్పడేందుకు ఈ ముఠా నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది.