అంతిమ యుద్ధానికి సిద్ధం కండి
కరీంనగర్, జూలై 28 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాదనకై అంతిమ యుద్దానికి సిద్ధం కావాలని ప్రజలకు, జేఏసీ శ్రేణులకు టీజేఏసీ రాష్ట్ర కోఆర్డి నేటర్ పిట్టల రవీందర్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఎస్‌బీఎస్ ఫంక్షన్ హాల్‌లో టీ-జేఏసీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా చైర్మన్ బి. వెంకట మల్లయ్య అధ్యక్షతన స్థానిక జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 10లోపు మండల స్ధాయి జేఏసీ కమిటీలను బలోపేతం చేసి, 15 లోపు గ్రామ గ్రామన కమీటీ నిర్మాణం పూర్తి చేసుకుంటామని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 30న జేఏసీ నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని కోరా రు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తూ ”చలో హైదరాబాద్” ప్రపంచంలోనే సువర్ణ ఒక చరిత్ర సృష్టించే విధంగా ఉంటుందని అన్నారు. ఈ దిశగా ప్రతి గ్రామం నుంచి 5 గురు సభ్యుల ను సమీకరించి తెలంగాణ ప్రాంతంలోని అన్ని గ్రామాలలో కార్యకర్తలతో ఒక శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యమ ప్రచారానికి అన్ని హంగులతో రాష్ట్ర జేఏసీ సిద్ధంగా ఉందని తెలిపారు. కరపత్రాలు, వాల్ పోస్టర్స్, డోర్‌స్టిక్క ర్స్, కళాబృందాలతో గ్రామ గ్రామాన్ని కదిలించి చలో హైదరాబాద్‌ను విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ సారి కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు. తెలంగాణపై తాడా పేడో విధంగా ఈ అంతిమ యుద్ధం ఉంటుందని, ఈ దిశగా ప్రతి కార్యకర్త మానసికంగా, భౌతికంగా సిద్ధం కావాలని కోరారు. ఈ సమావేశంలో టీి- జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ జక్కొజువెంకటేశ్వర్లు, కో ఛైర్మన్లు నల్లల నుకరాజు, కె.కిషన్ రావు, మాడుల రాముల, మర్రి శ్రీనివాస్ యాదవ్, కో- కన్వీనర్లు రాజేంద్ర శర్మ, కొడిమొంజ శంకర్, అధికార ప్రతినిధులు మార్వాడి సుదర్శన్, ఆంజ నేయ రావు, ఎమ్‌డి. ఫయాజ్ అలీ, నియోజకవర్గ ఇన్‌చార్జీలు తేజన్‌మూర్తి, పూల్‌సింగ్, తిరుమ ల్‌గౌడ్, కామశ్రీనివాస్, రాచర్ల వెంకన్న, వెంక ట్రాంరెడ్డి, రమాణారెడ్డి, మండల కన్వీనర్లు బి.వెం కటయ్య, విద్యార్థి జేఏసీ నాయకులు జక్కన పెల్లి గణేశ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, తిరుపతి నాయక్, లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.