అంత్యక్రియల కోసం 5వేల ఆర్థిక సహాయం.

తాండూరు అక్టోబర్ 13(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్ధాయిపేట్ గ్రామానికి చెందిన పుట్నాల నర్సింలు అనారో గ్యంతో మృతి చెందారు. గ్రామ యువకులు విషయాన్ని యంగ్ లీడర్స్ వ్యవస్థాపక అధ్యక్షు
లు గాజిపుర్ మురళి కృష్ణ గౌడ్ దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో స్పందించిన వెంటనే అంత్య క్రియల నిమిత్తం 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బిచ్చన్న గౌడ్, జనార్ధన్ గౌడ్ ,మురళి గౌడ్, భీమయ్య , శివ గౌడ్ తదితరులు ఉన్నారు.