అందని ద్రాక్షే.. మహిళా బిల్లు

` సభ ముందుకు.. 2027 తర్వాతే అమలు
` డీలిమిటేషన్‌తో లింకు
` కొత్తపార్లమెంట్‌ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు
` లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
` నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రిజర్వేషన్ల అమలు
` న్యాయమంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ ప్రకటన
(మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. ఎన్నికల జుమ్లా
` బిల్లులో ముస్లిం, ఓబీసీ వర్గాలకు కోటా లేదు
` ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ
` మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించిన ఎంఐఎం
` జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌ నిబంధనలపై విపక్షాల ఆగ్రహం
న్యూఢల్లీి(జనంసాక్షి):కొత్త పార్లమెంట్‌ కొలువుదీరింది. కొత్త పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్‌సభ లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ సభ్యుల ముందు ఉంచారు. ఈ బిల్లుకు ‘నారీ శక్తి వందన్‌’గా నామకరణం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేన్ల అమలు ఉంటుందని వెల్లడిరచారు. ఈ బిల్లుపై రేపు లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ బిల్లుపై ఎగువ సభలో గురువారం చర్చ జరగనుంది.
కాగా  మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ బిల్లును ‘ఎన్నికల జుమ్లా’ అని కాంగ్రెస్‌ అభివర్ణించింది. మహిళల ఆశలకు ‘భారీ ద్రోహం’ అని విమర్శించింది. ఈ చట్టం జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌ ప్రక్రియ అయిపోయిన తర్వాతే అమలులోకి వస్తుందని బిల్లులో పేర్కొనడంపై మండిపడిరది. 2024 ఎన్నికల లోపు డీలిమిటేషన్‌ జరుగుతుందా? అని కాంగ్రెస్‌? ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌? ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం 2021 జనగణను ఇంకా నిర్వహించలేదన్నారు. ఇక ఎన్నికల సీజన్‌?లో జుమ్లాల కంటే ఇది పెద్దది అని ఎద్దేవా చేశారు. ఇక జీ20 దేశాల్లో జన గణన చేయడంలో విఫలమైన దేశం భారత్‌? మాత్రమే అని అన్నారు. ఇది ఈవెంట్‌? మేనేజ్‌?మెంట్‌? తప్ప మరొకటి కాదని ఘాటుగా విమర్శించారు. మహిళా రిజర్వేషన్‌? బిల్లును ఎన్నికల ముందు మహిళలను మోసం చేసే బిల్లు అని ఆమ్‌? ఆద్మీ పార్టీ (ఆప్‌) సీనియర్‌ నేత అతిషి విమర్శించారు. బీజేపీకి మహిళల సంక్షేమం పట్ల ఆసక్తి లేదని ఆరోపించారు. ఈ బిల్లును నిశితంగా చిదివితే అది ‘మహిళలను ఫూల్‌? చేసే బిల్లు’ అని తెలుస్తుందని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లులో డీలిమిటేషన్‌, జనాభా లెక్కల నిబంధనలను ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. ‘దీని ద్వారా 2024 ఎన్నికల ముందు ఈ రిజర్వేషన్‌ అమలులోకి రాదని అర్థమవుతుంది. ఇప్పుడున్న డీలిమిటేషన్‌, జనాభా గణన నిబంధనలు అనుసరించి 2024 ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని మేము డిమాండ్‌? చేస్తున్నాము’ అని అతిషి అన్నారు. ఈ బిల్లుపై ఏఐఎమ్‌?ఐఎమ్‌? చీఫ్‌? అసదుద్దీన్‌? ఒవైసీ స్పందించారు. ‘మీరు ఎవరికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు? ప్రాతినిధ్యం లేని వారికి రిజర్వేషన్‌ కల్పించాలి. ముస్లింలకు కోటా లేకపోవడం ఈ బిల్లులో ప్రధాన లోపం. అందుకే మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాము’ ఒవైసీ పేర్కొన్నారు. ఈ మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు బహుజన్‌ సమాజ్‌?వాదీ పార్టీ-బీఎస్‌?పీ అధినేత్రి మయావతి మద్దతు పలికారు. ఎస్‌?సీ, ఎస్‌?టీ, ఓబీసీలకు ప్రత్యేక కోటా కోసం తమ పార్టీ డిమాండ్‌? చేస్తున్నప్పటికీ.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించే ఏ బిల్లుకైనా తాము మద్దతు ఇస్తామని తెలిపారు. ఇక మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇచ్చినా తమకు ఫర్వాలేదని.. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. చర్చల తర్వాత ఈ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ 33 శాతంలో కోటాలో వెనుకబడిన తరగతుల మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వకపోతే.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో కులతత్వ మనస్తత్వం ఉందని తమ పార్టీ భావించాల్సి వస్తుందని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌?సభలో ప్రవేశపెట్టడాన్ని బీజేపీ వర్గాలు స్వాగతించాయి. ఈ సందర్భంగా పట్నాలోని బీజేపీ మహిళా కార్యకర్తలు హోలీ ఆడారు. ప్రత్యేక మహిళా ఆహ్వానితులకు పార్లమెంట్‌?లో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్వీట్లు పంచారు. గాంధీ కుటుంబానికి తమ కుటుంబంలోని మహిళలకు సాధికారత కల్పించడంపైనే ఆసక్తి ఉందని.. పేద, దళిత మహిళల్లోని మహిళలకు సాధికారత కల్పించడంపై వారికి ఆసక్తి లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్‌?కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. సభలో సోనియా గాంధీ లేకపోవడం దురదృష్టకరమని.. ఆమె కుమారుడు కూడా వెళ్లిపోయారని మంత్రి అన్నారు. అంతేకాకుండా బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతివ్వకపోవడం విచారకరమని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును నటి ఈశా గుప్తా స్వాగతించారు. ‘కొత్త పార్లమెంటు మొదటి సమావేశంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయం. ఇది చాలా ప్రగతిశీల ఆలోచన. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే 2026లో మీరు నన్ను రాజకీయాల్లో చూస్తారు’ అని ఈశా గుప్తా అన్నారు.మహిళా రిజర్వేషన్‌ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. లోక్‌సభ నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ముస్లింలు, ఓబీసీ వర్గాలకు కోటా లేదని, ఇది అన్యాయం అని అన్నారు. ఈ కారణంగానే తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు ఎంపీ అసదుద్దీన్‌. ‘మీరు తక్కువ ప్రాతినిథ్యం ఉన్నవారికి ప్రాతినిథ్యం ఉండేలా బిల్లును తీసుకువస్తున్నారు. అయితే, మన దేశంలో ఇప్పటి వరకు 70 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 8,992 మంది ఎంపీలు ఎన్నికైతే.. అందులో 520 మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు. అంటే.. 50 శాతానికి పైగా లోటు ఉంది. ఇక ఆ 520 మందిలోనూ స్త్రీలు గుప్పెడు మంది కూడా లేరు. మరి మీరు ఈ బిల్లు ద్వారా ఎవరికి ప్రాతినిథ్యం కల్పించాలనుకుంటున్నారు? అవసరం ఉన్నవారికి ప్రాతినిథ్యం ఇవ్వాలి. ముస్లిం, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్‌ కోటా లేకపోవడం ఈ బిల్లులోని ప్రధాన లోపం. అందుకే ఈ బిల్లును మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.’ అని స్పష్టం చేశారు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. కాగా, దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు కొత్త పార్లమెంట్‌ హౌస్‌లో మొదటి సెషన్‌ ప్రారంభమైన వెంటనే అంటే సెప్టెంబర్‌ 19వ తేదీన మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఫ్‌ువాల్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై బుధవారం చర్చ జరుగనుంది. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఇవాళ న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఫ్‌ువాల్‌ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కాగా, 15 ఏళ్లపాటు వర్తించే ఈ రిజర్వేషన్‌ బిల్లును.. గత 27 ఏళ్లలో అనేకసార్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ప్రతిసారి ఆ బిల్లు వీగిపోయింది. చివరిసారిగా 2010లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా.. రాజ్యసభలో ఆమోదం లభించింది కానీ, లోక్‌సభలో వీగిపోయింది. దాంతో ఆ బిల్లు అలా మూలన పడిపోయింది. ఇప్పడు బిల్లు మళ్లీ పార్లమెంట్‌ ముందుకు వచ్చింది. ప్రభుత్వం కూడా ఈ బిల్లు ఆమోదానికి సిద్ధంగా ఉండటంతో.. ఈసారి మహిళా రిజర్వేషన్‌ బిల్లు పక్కా అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఇవాళ కొత్త పార్లమెంట్‌లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అజ్జున్‌ రామ్‌ మేఫ్‌ువాల్‌ మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు. బుధవారం నాడు లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందే అవకాశం కనిపిస్తోంది. ఎల్లుండి రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. బిల్లు పాసైతే.. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం కోటా రిజర్వేషన్‌ అమలువుతుంది. ఇక ఈ బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వం 128వ రాజ్యాంగ సవరణ చేస్తోంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2024 ఎన్నికలకు మహిళా బిల్లు అమలు లేనట్టే కనిపిస్తోంది. ఈ సెషన్‌లో పాస్‌ అయినా, ఆపై ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్‌ అమల్లోకి రానుంది. నియోజకవర్గాల పునర్‌విభజన తర్వాతే రిజర్వేషన్‌ అమల్లోకి వస్తుంది. ఈ రిజర్వేషన్‌.. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా అమలుకానున్న నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రాకపోవచ్చని చెబుతున్నారు. ఇక నియోజకవర్గాల పునర్‌విభజన కోసం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. నియోజకవర్గాల పునర్‌విభజన తర్వాతే మహిళా కోటా అమలు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తరువాత పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీల్లో రిజర్వేషన్‌ అమల్లోకి వస్తాయి. దేశ రాజధాని ఢల్లీి అసెంబ్లీలో కూడా ఈ రిజర్వేషన్‌ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రిజర్వేషన్లు రొటేషన్‌ ప్రకారం అమల్లోకి రానున్నాయి. ఈ మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే.. పార్లమెంట్‌లో 30 శాతం సీట్లు పెరగనున్నాయి. మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఫ్‌ువాల్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. ప్రభుత్వం తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బిల్లు ప్రతులను తమకు ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు విపక్ష పార్టీల నేతలు. దీనికి స్పందించిన ప్రభుత్వం.. డిజిటల్‌ ఫార్మాట్‌లో అప్‌లోడ్‌ చేశామని బదులిచ్చింది. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్‌ పక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే.. 2010లోనే రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించిందని, కాంగ్రెస్‌కు బిల్లుపై క్రెడిట్‌ ఇవ్వడం ప్రధానికి ఇష్టం లేదని విమర్శించారు.