అందరికి వన్ ర్యాంక్.. వన్ పెన్షన్
స్వచ్ఛంద సైనికులకు వర్తిస్తుంది
మెట్రో రైళ్లో ప్రయాణించిన మోదీ
ఫరీదాబాద్, చంఢీగఢ్
గత ప్రభుత్వం ఓఆర్‌ఓపీ కోసం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించింది. మా ప్రభుత్వ హయాంలో ఆ మొత్తం రూ.10 వేల కోట్లకు పెంచామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మా ప్రభుత్వం ఏర్పడగానే ఓఆర్‌ఓపీ అమలుకు నిర్ణయించింది. స్దచ్చంద పదవి విరమణ పొందేవారికి కూడా ఒకే పింఛను వర్తిస్తుంది. రాజకీయ లబ్ధి కోసం కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒకే ర్యాకు, ఒకే పంఛనుపై 40 ఏళ్లుగా ఏవిూ చేయని కాంగ్రెస్‌కు ప్రశ్నించే అర్హత లేదని విమర్శించారు. బదర్‌పూర్ మెట్రోరైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హర్యానా నాకు రెండో ఇల్లు వంటిందని తెలిపారు. గుజరాత్ నుంచి వచ్చాక చాలాకాలం తర్వాత హర్యానాలో గడిపానని పేర్కొన్నారు. మా ప్రభుత్వ ఏకైక లక్ష్యం దేశ అభివృద్ధి. గత ప్రభుత్వం చేయని పనులు మేము తప్పకుండా పూర్తి చేస్తాం. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు. విధానపరమైన నిర్ణయాలే ప్రధానం. అభివృద్ధి అన్ని విధాలా పేదలకు ప్రయోజనం చేకూరుస్తుంది. దేశంలోని పౌరులు ఇల్లు లేకుండా ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను మేము నెరవేరుస్తామని హామి ఇచ్చారు. బాలికల సంరక్షణకు హరియాణా తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. మేము ఇచ్చిన హావిూలను కచ్చితంగా నేరవేరుస్తున్నామని ప్రధాని వెల్లడించారు. ఢిల్లీ(బాదర్‌పుర్ స్టేషన్)-ఫరీదాబాద్(ఎస్కార్ట్స్ ముజిసర్ స్టేషన్) మెట్రో రైలు మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు జెండా ఊపి ప్రారంభించారు. 13.87 కిలోవిూటర్ల ఈ మెట్రో కారిడార్‌లోని అన్ని స్టేషన్లు, డిపోలు సోలార్ విద్యుత్ సామర్ధ్యాన్ని కలిగిఉన్నాయి. సోలార్ విద్యుత్‌తో నడిచే మొదటి మార్గం ఇదే. సరాయ్, ఎన్‌హెచ్‌పీసీ చౌక్, మేవాలా మహారాజ్‌పూర్, సెక్టార్28, బాద్‌కల్ మోర్, ఓల్డ్ ఫరీదాబాద్, నీలం చౌక్ అజ్రోందా, బాటా చౌక్, ఎస్కార్ట్స్ ముజేసర్ వంటి తొమ్మిది స్టేషన్లను ఈ మెట్రో మార్గం కలిగిఉంది.రూ. 2,500 కోట్ల వ్యయం కలిగిన ఈ ప్రాజెక్టుకు హర్యానా ప్రభుత్వం రూ. 1,557 కోట్లు, కేంద్రం రూ. 537 కోట్లు, ఢిల్లీ మెట్రో రూ. 400 కోట్లు సమకూర్చింది. ఈ మెట్రో ప్రయాణం అందుబాటులో ఛార్జీలు, సురక్షితం, సౌకర్యవంతం, పర్యావరణహితంతో కూడుకొని ప్రయాణికులకు సేవలను అందించనున్నట్లు హర్యానా ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు ప్రధాని ఢిల్లీ మెట్రోరైలులో ప్రయాణించి ఫరీదాబాద్‌కు చేరుకున్నారు.