అందరి సహకారం ఉంటే మరింత అభివృద్ధి

బషీరాబాద్ సెప్టెంబర్30, (జనం సాక్షి)బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నావంద్గీ (బషీరాబాద్)లో శుక్రవారం రోజున సర్వసభ్య సమావేశం అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘం మరింతగా అభివృద్ధి చెందాలంటే పాలకవర్గ సభ్యులు మరియు ఎల్టి లోన్ తీసుకున్న వారందరూ, ఖాతాదారులు రైతులు సహకరించాలని తెలిపారు. కొత్త లోన్స్ ఇవ్వాలంటే 63% కలెక్షన్ కంప్లీట్ చేయాలని, అదేవిధంగా ఎల్టి లోన్లు 50% శాతానికి రికవరీ ఉంటేనే మళ్లీ కొత్త లోన్స్ ఇవ్వటానికి అవకాశం ఉందని ఎల్టు లోన్లు తీసుకున్న వారందరూ కట్టాలని అప్పుడే కొత్తవారికి అవకాశాలు ఉంటాయని చెప్పారు. అదేవిధంగా గతంలో అనుకున్న విధంగా షాపింగ్ కాంప్లెక్స్ మరియు పెట్రోల్ పంపు, నాబార్డ్ రైస్ మిల్, ఇవన్నీటికి పాలకవర్గ సభ్యులు ఆమోదం లభించిందని వీటికి సంబంధించిన అధికారులకు ప్రతి ఒక్క డాక్యుమెంటు పంపించడం జరిగిందని త్వరలో వీటిని అన్నింటిని ప్రారంభించబోతున్నామని చెప్పారు.మన సొసైటీలో నూతనంగా ఫర్టిలైజర్ అమ్మ బోతున్నామని శాంపిల్ కింద యూరియా కు సంబంధించిన బాటిల్స్ రూపంలో పంపించారని అదేవిధంగా విత్తనాలు వేరుశెనగలు,సెనగలు అందుబాటులో ఉన్నాయని ఈ యొక్క సొసైటీని అభివృద్ధి బాటలో నడిపించడానికి అందరి సహకారం ఉండాలని సభాముఖంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఈవో వెంకటయ్య, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కే.రాజరత్నం,పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్,పాలకవర్గ సభ్యులు అశోక్ చంద్ర గౌతమ్, రంగారెడ్డి,నర్సి రెడ్డి,నవీన్ రెడ్డి,పాపమ్మ,రూప్లా నాయక్, హనుమంత్ రెడ్డి,సొసైటీ క్యాషియర్ ఫారూఖ్,సొసైటీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
Attachments area