అందుబాటులో పశుగ్రాసం

చిత్తూరు,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): పశువులకు అవసరమైన పశు గ్రామం అందుబాటులో ఉంచేలా తగు ప్రణాళిక రూపొందించుకోవాలని పశుసంవర్థక శాఖ అధికారులు చెప్పారు. రానున్న వేసవిలో పశువులకు తగినంత గ్రాసం అందించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని  అన్నారు.  పశుసంవర్ధక శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.  గ్రామానికి ఒకేచోట పశువులకు తాగునీటి తొట్టెలు ఏర్పాటు చేయడంతో పాటు నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలో రైతులు పశువులు అమ్మకుండా చూడాలని, పశుగ్రాసం లేకుండా మరణించే దుస్థితి రాకుండా చూడాలని తెలిపారు. పాల ఉత్పత్తి తగ్గకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న వేసవిలో జిల్లాలో పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌  భరత్‌ గుప్తా పేర్కొన్నారు. వరిపంట ఎన్నాళ్లకు కోతకొస్తుంది? ఎంత మోతాదులో గడ్డి లభ్యం కావచ్చు? ధర ఏ మాత్రం ఉంటుంది? తదిరాలపై ఆరా తీశారు. ఇక్కడ కొనుగోలు చేసే గ్రాసాన్ని పడమటి మండలాలకు రవాణా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.