– అంధకారంలో బాలికల భవిష్యత్తు.
– సాయం కోసం చిన్నారులు ఎదురుచూపు…
బూర్గంపహాడ్ ఆగష్ఠ్25 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన కట్కోజు శశికళ (మహిళ 25) తెల్లవారుజామున విష జ్వరంతో మృతి చెందింది. ఆమెకు పూజిత 12సంవత్సరాలు, భవ్య 11 సంవత్సరాలు కలిగిన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మృతురాలు భర్త రాజశేఖరా చారి, వీరిది అతి నిరుపేద కుటుంబం కావడంతో కనీస వైద్యానికి కూడా నోచుకోని పరిస్థితిలో పక్కన ఉన్న కొందరు ఆర్థిక సహాయం అందించి వైద్య నిమిత్తం ఖమ్మం తరలించి వైద్యం అందిస్తున్న తరుణంలో బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. భర్త గతంలో తాపీ పని చేసుకుంటూ ఉండేవాడు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిస్థాయిలో పని చేయకుండా మద్యానికి బానిస కావడంతో పిల్లలిద్దరూ ఆలనా పాలన అంతా తల్లి శశికళ పూర్తి బాధ్యతలు మీదేసుకొని కూలి పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో…. ఆ కుటుంబంలో విధి వెక్కిరించి కంటికి రెప్పలా కాపాడుకునే కన్నతల్లి కళ్లెదురు మృతి చెందడంతో ఆ ఇద్దరి చిన్నారుల భవిష్యత్తు అంధకారంగా మారింది. ఏ కష్టం తెలియకుండా పెంచి పోషిస్తూ చదివించుకుంటూ ఉన్న మాతృమూర్తి మరణించడంతో పిల్లల ఆలనా పాలన చూసే దిక్కు ఎవరు అంటూ పలువురు వారిని చూసి అయ్యో పాపం అంటూ కన్నీటిని రాలుస్తున్నరు. ఆ చిన్నారులు ఇద్దరికి ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, మానవత్వం కలిగిన మహనీయులను వారి బంధువులు వేడుకుంటున్నారు. చిన్నారులకు చేయూతనిద్ధం రండి.. అంటూ వేడుకుంటూ…. దయగల దాతలు తమ దాతృత్వాన్ని చాటుకోవాలని , మానవత్వంతో ఆలోచించి ముందుకు రావాలని వేడుకుంటూ….
సాయం చేయదలచిన వారు 63003 98268 ఈ నెంబర్ కి ఫోన్ పే చేయగలరు. (గంటా కిట్టు).