అంధుల పాఠశాలలో జాతీయస్థాయి చెస్ పోటీలు ప్రారంభించిన డీజీపీ రాజీవ్ త్రివేది
హైదరాబాద్, జనంసాక్షి: బేగంపేటలోని దేవ్‌నార్ అంధుల పాఠశాలలో జాతీయస్థాయి అంధుళ చెస్ పోటీలు ఈ రోజు ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో 13 రాష్ట్రలకు చెందిన 150 మంది అంధ విధ్యార్థినీ విద్యార్థులతో పాటు పలువురు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అంధ చెస్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. సామాన్య వ్యక్తలకు ధీటుగా అంధులకు ఇటువంటి పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయమని రాజీవ్ త్రివేది అన్నారు.