అంబేడ్కర్ వల్లే తెలంగాణ కల సాకారం
– దూరదృష్టికల మహానేత
– 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్,ఏప్రిల్ 14(జనంసాక్షి): అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ చట్టం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన దూరదృష్టి వల్‌లనే రాజ్యాంగంలో అనేక రక్షణలు కల్పించారని అన్నారు. బలహీన రాష్ట్రలకు కేంద్రం అండగా ఉండాలనే అంబేడ్కర్ చట్టం తెచ్చారని, ఆయనకు తెలంగాణ సమాజం రుణపడి ఉందన్నారు. ఎన్టీఆర్ గార్డెన్స్ హిల్‌రాక్ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహానికి సీఎం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కెసిఆర్ మాట్లాడుతూ ట్యాంక్ బండ్‌కు ఈశాన్యంలో 15 అంతస్తులతో అంబేడ్కర్ టవర్స్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ స్ఫూర్తి ప్రదాత అన్నారు. అంబేద్కర్ తెచ్చిన చట్టంతోనే ఇవాళ తెలంగాణ స్వేచ్చా వాయువులు పీలుస్తోందని పేర్కొన్నారు. కొత్త రాష్టాల్రు ఏర్పాటు చేసే అధికారం కేంద్రం దగ్గరే ఉండాలని అంబేద్కర్ రాత్రంతా కూర్చుని ఒక నోటు తయారు చేశారని వివరించారు. రాష్టాల్రను ఏర్పాటు చేసే అధికారం కేంద్రం దగ్గరే ఉండాలని చట్టం చేయడం వల్లే మనకు తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని తెలిపారు. అంబేద్కర్ దయవల్లే మనం దోపిడి నుంచి విముక్తి పొందామన్నారు. అంబేద్కర్‌కు ఎంత గొప్పగా నివాళులర్పించినా తక్కువేనని స్పష్టం చేశారు. తెలంగాణలో దళితుల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. కెజీ టూ పిజి,దళితులకు మూడెకరాలు వంటి కార్యక్రమాలు అట్టడుగున ఉన్న ఈ వర్గాల కోసమేనని అన్నారు. కేజీ టు పీజీలో భాగంగా రాష్ట్రంలో 250 ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మైనార్టీల కోసం 75 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పేదల ఆత్మగౌరవం పెంచాలని అంబేడ్కర్ కలలుగన్నారు.. వారి జీవితాల్లో వెలుగుకోసమే 2 పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.గారు గౌరవంగా బతకాలన్నదే తమ అభిమతమన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 2.60లక్షల ఇళ్లు నిర్మించబోతున్నామని తెలిపారు. సుమారు రూ.10కోట్లతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ… దళిత విద్యార్థుల కోసం మరిన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. దేశం గర్వించే విధంగా నగర నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు బాల్కా సుమన్, పసునూరి దయాకర్, పలువురు ఎమ్మెల్యేలు, సాంఘిక సంక్షేమశాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నగరంలో పలుచోట్ల అధికారిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ ఘాట్ సవిూపంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ పనులకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. అద్బుతమైన ఎ/-లాట్‌ఫామ్‌తో ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామన్నారు. ముందు బుద్దుడు తర్వాత అంబేద్కర్ విగ్రహం, వెనకాల సచివాలయం ఉండాలని ఈ స్థలాన్ని ఎంపిక చేశామన్నారు. హైదరాబాద్‌కు ల్యాండ్ మార్క్‌లా ఉండేలా 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతకుముందు బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వేదపండితులు పూజలు నిర్వహించగా సీఎంతోపాటు మంత్రులు గ్రానైట్ రాయిని వేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, ¬ంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ బూర నర్సయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌తోపాటు పలువురు దళిత నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




