అంబేద్కర్ కు అసలైన నివాళి ఇదే
:- సీఎం కేసీఆర్, స్పీకర్ చిత్రపటాలకు క్షిరాభిషేకం
చేస్తున్న తెరాస నాయకులు…
రుద్రూర్ :- నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ నామకరణం చేసినందుకు దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్, సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిల చిత్ర పటాలకు తెరాస మండల నాయకులు క్షిరభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత సామాజిక దార్శనికుడు మహా మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును సచివాలయనికి నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శమని తెలిపారు. ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని తెరాస పార్టీ తరుపున మండల నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ కు అసలైన నివాళి ఇదేనని నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో
జడ్పీటిసి నారోజి గంగారాం,మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, అక్కపల్లి నాగేందర్, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, గ్రామ పార్టీ అధ్యక్షుడు తొట్ల గంగారాం, విండో ఛైర్మెన్ సంజీవ్ రెడ్డి, సంజీవులు , వైస్ ఎంపీపీ సాయిలు, టిఆర్ఎస్ యువజన అధ్యక్షుడు కన్నె రవి , మైనార్టీ సెల్ గ్రామ అధ్యక్షుడు జమిల్ , ఎస్సి సెల్ అధ్యక్షుడు కిషోర్, సురేష్, దళిత సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.