*అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత*

మండలం( జనం సాక్షి న్యూస్)

మెళ్లచెర్వు మండలం కందిబండ గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటాల
రేషన్ బియ్యాన్ని మెళ్లచెర్వు సబ్ ఇన్స్పెక్టర్ పి.సురేష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం నమ్మదగిన సమాచార మేరకు కందిబండ గ్రామంలో ఓ ఇంట్లో నిల్వవుంచిన రేషన్ బియ్యం తనిఖీలో బాగంగా పీసీ గోపయ్య ,నాగరాజు, ఇద్దరు నిన్న రాత్రి సుమారు 7 గంటల సమయంలో తనిఖీ చేయగా అక్రమ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు. పట్టుబడ్డారు. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న వ్యక్తి రాత్రి అందుబాటులో లేకపోవడంతో రాత్రి ఆ గదిని సీజ్ చేసి ఉదయం రేషన్ బియ్యాన్ని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.
కందిబండ గ్రామంలో రేషన్ డీలర్ సపోర్ట్ తో గత ఏడాది నుండి రేషన్ దందా కొనసాగడం గమనార్హం. ఈ దందా చేస్తున్న వ్యక్తి పై గతంలో కేసుకుడా నమోదు చేశారు.