అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం
– ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తాం
– జీహెచ్‌ఎంసీ కమిషనర్
హైదరాబాద్,జనవరి16(జనంసాక్షి): గ్రేటర్ ఎన్నికల్లో అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ జనార్థన్‌రెడ్డి తెలిపారు. గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 30వ తారీఖు లోపే ఓటర్ స్లిప్‌ల పంపిణీ పూర్తి చేస్తామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ జనార్థన్‌రెడ్డి తెలిపారు. ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా యాప్ రూపొందించామని వెల్లడించారు. యాప్ ద్వారా ఓటరు జాబితాలో పేరు ఉందో, లేదో తెలుసుకోవచ్చు. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న వర్గాల్లోనే ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోందన్నారు. దీనిని అధిగమించేందుకు గ్రేటర్‌లో ఓట్ల శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్ అవేర్ నెస్ ప్రోగ్రామ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం. సినిమా ?స్లెడ్స్, ¬ల్డింగ్స్ ద్వారా ఓటర్లలో చైతన్యం తెస్తామన్నారు. మొబైల్ రింగ్‌టోన్‌లో ఓటర్లను చైతన్య పర్చేందుకు ప్రయత్నిస్తాం. ఈవీఎంలపై ముందుగానే అవగాహన కల్పిస్తామన్నారు. ఇదిలావుంటే హైదరాబాద్ ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూస్తామని, ఓటింగ్ వ్యవస్థను మరింత సులభతరం చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ప్రకటించారు. ఎన్నికల ఖర్చు విషయంలో అవినీతి ఎక్కువగా ఉంది. అవినీతి వల్ల తాత్కాలిక లాభం, శాశ్వత నష్టం కలుగుతుందని తెలిపారు. అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేస్తే అభ్యర్థులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అవినీతిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. అవినీతిపై ఫిర్యాదులకు కొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. అభ్యర్థులు అవినీతికి పాల్పడినట్లు రుజువైతే అనర్హులుగా ప్రకటిస్తామన్నారు.