అక్రమాలు జరగ కుండా రిజిస్ట్రేషన్లు:డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

dy-cm-aliరాష్ట్రంలో అక్రమాలకు తావులేకుండా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు.  ఏ ప్రాంతం నుంచైనా రిజిస్ట్రేషన్లలో ఎలాంటి అక్రమాలు లేవని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మహమూద్ అలీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తెలంగాణలో బినామీ రిజిస్ట్రేషన్లు అరికట్టామన్నారు. ప్రతీ రిజిస్ట్రేషన్‌ను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు.  ప్రజల కోసం కొన్ని ఆఫీసుల్లో ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించామని తెలిపారు.