అక్రమాల నివారణకు టాస్క్‌ఫోర్స్
హైదరాబాద్ అక్టోబర్14(జనంసాక్షి):
పౌరసరఫరాల శాఖలో అక్రమాల నివారణకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పౌరసరఫరాల శాఖలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. కొన్నిచోట్ల అధికారుల ప్రమేయంతోనే అక్రమాలు జరుగుతున్నాయన్నారు. అక్రమాల సమాచారమిచ్చేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదేపదే అక్రమాలకు పాల్పడేవారి డీలర్‌షిప్ రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో తెదేపా నేతలు శిఖండి పాత్రలు పోషిస్తున్నారని మండిపడ్డారు. తెదేపా నేతల మతిలేని ఆరోపణలకు తాము సమాధానమివ్వలేమన్నారు. వారి ఆరోపణలకు విద్యార్థులే సమాధానం చెబుతారని పేర్కొన్నారు.