అక్రమ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు

 

-పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి

కరీంనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్‌ పోలీస్‌కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల భద్రతకోసం తీసుకుంటున్న పలురకాల చర్యలకు అన్నివర్గాల ప్రజలనుంచి సహకారం అందిస్తున్నారన్నారు. నగరంలోని మారుతి నగర్‌లో గురువారం తెల్లవారు జామున కార్డన్‌సర్చ్‌ నిర్వహించారు. పోలీస్‌ బృందాలగా ఏర్పడి మారుతి నగర్‌ జల్లెడ పట్టారు. అనంతరం ఏర్పాటైన కార్యక్రమంలో కమలాసన్‌ రెడ్డి మాట్లాడుతూ నేరాల ఛేదన, నియంత్రణకు దోహదపడే సిసి కెమెరాల ఏర్పాటు కోసం నేను సైతం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఈ మద్య కాలంలో జరిగిన అనేక నేర సంఘటనలు సిసి కెమెరాల పుటేజి ఆధారంగా చేదించడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అసాంఘీక కార్యకలాపాలకు ఆడ్డుకట్ట వేసేందుకు డ్రోన్‌కెమరాలను వినియోగిస్తున్నామన్నారు. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు రాకుండా పోలీస్‌లకు సమాచారం చేరవేసేందుకు వీలుగా హాక్‌ఐ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న యువత, పౌరుడు డౌన్‌లోడ్‌చేసుకుని వినియోగించాలన్నారు. ఆ యాప్‌లో మహిళలు ఏదైనా వాహనంలో ప్రయానిస్తున్నప్పుడు, డ్రైవర్‌ అసభ్యకరంగా ప్రవర్థించినా ఇతర ఏదైనా ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నట్లితే ఒక్క విూట నొక్కితే ఎంచుకున్న ఐదుగురు కుటుంబ సభ్యులతోపాటు సంబందిత పోలీస్‌ అధికారులకు గూగుల్‌ మ్యాప్‌తో ఆదారంగా సమాచారం అందడంతోపాటు అలారమ్‌ వస్తుందన్నారు. వాహనాల కొనుగోలు సందర్బంలో సరైనదృవపత్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాహనాలు దోంగిలించబడిన ప్రమాదాలు జరిగిన సందర్బాల్లో ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. అక్రమ కార్యకలాపాలకు సంబందించి సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచడంతోపాటు నగదు పారితోషికాన్ని అందిస్తామన్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో తినుబండారాలను తయారు చేస్తున్న కేంద్రాన్ని సీజ్‌చేశారు సరైన దృవపత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలు, రెండు క్వింటాల్ల రేషన్‌ బియ్య స్వాదీనం చేసుకున్నారు. నేను సైతం కార్యక్రమంలో నాలుగు సిసి కెమరాల ఏర్పాటుకు కార్పోరేటర్‌ నేతికుంట కళావతి యాదయ్య, రిటైర్డ్‌ ప్రధానోపాద్యాయుడు మల్లయ్య, ప్రైవేట్‌ హాస్టల్‌ నిర్వాహకుడు రెండు కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. కార్యక్రమంలో నగర ఎసిని వెంకటరమణచ, ఇన్స్‌పెక్టర్లు తుల శ్రీనివాసరావు, మహేశ్‌గౌడ్‌, శ్రీనివాసరావు వివిద విబాగాలకు చెందిన 150 మంది పోలీస్‌లు పాల్గొన్నారు.