అక్రమ ప్రాజెక్టుతో జల జగడం వద్దు…
జగన్ సర్కారుకు కేసీఆర్ హెచ్చరిక
కృష్ణా నదీ జలాల్లో మా వాటా వదులు కోము..
న్యాయపోరాటం చేసితాడో పేడో తేల్చుకుంటాం
హైదరాబాద్,మే 11(జనంసాక్షి):శ్రీశైం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోత పథకం నిర్మించాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని అన్నారు. తెంగాణ రాష్ట్ర ప్రయోజనాకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎపి ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాని అధికారును సిఎం ఆదేశించారు. తెంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తప్పిదాుగా సిఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవంభిస్తామని స్పష్టం చేశారు.శ్రీశైం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసి నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోత పథకం చేపట్టడానికి నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దీనికి సంబంధించి జీవో కూడా విడుద చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రు ఈట రాజెందర్, మహమూద్ అలీ, శ్రీనివాస గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సహాదారు రాజీవ్ శర్మ, నీటి పారుద సహాదారు ఎస్.కె.జోషి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటి పారుద శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇఎన్సి మురళీధర్, ఎజి బి.ఎస్. ప్రసాద్, అడిషనల్ ఎజి రాంచందర్ రావు, లీగల్ కన్సల్టెంట్ రవీందర్ రావు, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాం ప్రసాద్ రెడ్డి, చంద్రమౌళి, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఓఎస్డి శ్రీధర్ దేశ్ పాండే, నీటి పారుద శాఖ సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తపెట్టిన కొత్త ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్ట తచిన ప్రాజెక్టు తెంగాణ రాష్ట్ర ప్రయోజనాకు భంగకరం కాబట్టి, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు.‘‘తెంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ కొత్త నీటి పారుద ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోలేదు. శ్రీశైం ప్రాజెక్టు తెంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టు. ఇందులోని నీటిని రెండు రాష్ట్రాు వాడుకోవాలి. కానీ తెంగాణ రాష్ట్రాన్ని కనీసం సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైం ప్రాజెక్టులోని నీటిని లిఫ్టు చేయాని నిర్ణయించి, జీవో జారీ చేసింది. ఇది తీవ్ర అభ్యంతకరం. కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకుపోతే ఉమ్మడి పామూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాు జారీ చేయాని వెంటనే కె.ఆర్.ఎం.బి.లో ఫిర్యాదు చేస్తాం’’ అని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.‘‘గతంలో ఉన్న వివాదాను, విబేధాను పక్కన పెట్టి రెండు రాష్ట్రా రైతు ప్రయోజనాు కాపాడడమే క్ష్యంగా నదీ జలాను వినియోగించుకుందామని తెంగాణ ప్రభుత్వం ఎపికి స్నేహహస్తం అందించింది. బేసిన్లు, బేషజాు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించాను. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం తెంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైంలో నీటిని లిఫ్టు చేయడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరం. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్పూర్తికి ఇది విఘాతం కలిగించింది. తెంగాణ రాష్ట్ర ప్రయోజనాకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తే లేదు. ఎపి తపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరడమే క్ష్యంగా న్యాయపోరాటం చేస్తాం’’ అని సిఎం కేసీఆర్ ప్రకటించారు. కృష్ణా నదిలో రాష్ట్రా వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో చాలా జాప్యం జరుగుతున్నందున, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాని సిఎం కేసీఆర్ అధికారును ఆదేశించారు.గోదావరి నది నికర జలాల్లో తెంగాణ రాష్ట్రానికి ఉన్న 950 టిఎంసి నీటిని వాడుకోవడానికి అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నది. తెంగాణకు ఇంకా నీటి అవసరం ఉంది. మంచినీటి అవసరాకు, పారిశ్రామిక అవసరాకు, విద్యుత్ ప్లాంట్లకు నీరు కావాలి. కాబట్టి గోదావరి మిగు జలాల్లో తెంగాణకు 600 టిఎంసిను కేటాయించాని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాని సిఎం అధికారును ఆదేశించారు. రోజుకు రెండు టిఎంసి నీటిని లిఫ్టు చేయడానికి ఉద్దేశించిన పామూరు`రంగారెడ్డి ఎత్తిపోత పథకాన్ని సత్వరం పూర్తి చేయాని అధికారును ఆదేశించారు.