అక్రమ మద్యం అడ్డుకునే వ్యూహం
సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు
ఆదిలాబాద్,నవంబర్15(జనంసాక్షి): ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాను నివారించేం దుకు నిఘా మరింత పెంచారు. ఇందులో భాగంగానే తెలంగాణ, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న వాంకిడి, సిర్పూర్(టి)తోపాటు ఆసిఫాబాద్, గోలేటి ఎక్స్‌రోడ్, కాగజ్‌నగర్‌లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా మద్యం సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతీ వాహనాన్ని ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించాకే పంపిస్తున్నారు. అయితే ఈ తనిఖీల ద్వారా కొంత వరకూ సామాన్యులు కూడా ఇబ్బందులకు గురువుతున్నారు. అలాగే మద్యం తరలిం పుపైనా ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. ఎన్ని కలకు ముందు ఏరులై పారే మద్యం అమ్మకాలు, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇతర ప్రాంతల నుంచి అక్రమంగా మద్యం తరలిపోకుండా ప్రత్యేక తనిఖీలపై సైతం చేపడుతున్నారు. దీనికి తోడు జిల్లాలో నిరంతరం హైవేలపై తిరుగుతూ ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూస్తున్నారు. న్నికల భద్రత అంశాలపై దృష్టి సారించిన పోలీసులు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 3, కాగజ్‌నగర్ మరో మూడు భద్రత బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. దీనితోపాటు మొబైల్ పెట్రోలింగ్, బ్లూకోట్ టీంలు ఎప్పటికప్పుడు నిఘాను పెంచుతున్నాయి. దీనికి తోడు గత ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన వ్యక్తులతోపాటు రౌడీషీ టర్లను బైండోవర్ చేసి రూ.లక్ష సొంతపూచీకత్తుపై విడుదల చేస్తున్నారు.