అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాలి
ఖమ్మం, నవంబర్ 30 : అక్రమ రిజిస్ట్రేషన్లను, దాడులను అడ్డుకొని స్థిరాస్తి వ్యాపార విలువలను కాపాడేందుకు సహకరించాలని జిల్లా రియల్ ఎస్టెంట్, రియల్ డర్స్ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు నాగభూషణం డిమాండ్ చేశారు. స్థిరాస్తి వ్యాపారం విస్తరిస్తున్న నేపథ్యంలో కొందురు అక్రమార్కులు భూ దందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారికి కొందరు అధికారులు సహకరిస్తుండడంతో వ్యాపార విలువలు అడుగంటిపోతున్నాయన్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లు సెటిల్‌మెంట్లతో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోందన్నారు. తక్షణం జిల్లా ఉన్నత అధికారులు, పోలీసులు కలగజేసుకొని వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు.