అఖిలపక్షం కోరిన పార్టీలే వెనకడుగు వేస్తున్నాయి. : మందా జగన్నాథం
న్యూఢిల్లీ : అఖిలపక్షం ఏర్పటు చేయమని చెప్పిన పార్టీలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయని ఎంపీ మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ ప్రాంత ఎంపీలనుంచి ఒకరిని అఖిలపక్షానికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. డిసెంబరు 9 నాటి ప్రకటనకు కట్టుబడి ఉండాలని మరో ఎంపీ పొన్నం డిమాండ్ చేశారు. ప్రజల మధ్య చెబుతున్న మాటనే తెదేపా అఖిల పక్ష సమావేశంలో చెప్పాలని ఆయన కోరారు. రాజకీయ పార్టీలుగా మీ అభిప్రాయం చెప్పాలని కాంగ్రెస్ చెప్పేవరకు వేచిచూడాలని పొన్నం సూచించారు. అఖిల పక్షంలో పార్టీలు గా మీ అభిప్రాయం చెప్పాలని రాజయ్య సూచించారు. ఎంపీలు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.