అఖిలపక్ష భేటీకి సోనియాను పిలవండి: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ వాదాన్ని అడ్డుకునేందుకే కేంద్రం అఖిలపక్షం అనే కొత్త నాటకాన్ని ఆడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అఖిలపక్ష తేదీని అనుకున్న తేదీకంటే ముందుగానే నిర్వహించాలని ఆయన డిమాండ్ వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరపున సోనియాగాంథీని పిలవాలని , భాజపా తరపున గడ్కరీని పంపిస్తామని చెప్పారు.