అఖిల్‌ గొగోయ్‌పై దాడి కేసులో ఒకరు అరెస్టు

న్యూఢీల్లీ: సహచట్టం కార్యకర్త అన్నా బృందం సభ్యుడు గొగోయ్‌పై అస్సాంలో యాత్‌ కాంగ్రెస్‌ కార్యక్రర్తల దాడి కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. అస్సాంలో భారీగా వరదలు ముంచెత్తిన నేపధ్యంలో నలబారి జిల్లా ధరమ్‌పూర్‌ ప్రాంతానికి నిన్న అఖిల్‌ వెళ్లారు. అక్కడ ఆయనపై కొందరు వ్యక్తులు కర్రలు, కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన తలకు గాయాలు కావటంతో నటబారి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. తనపై దాడిచేసింది యూత్‌కాంగ్రెస్‌ కార్యకర్తలని అఖిల్‌ ఆరోపించారు. పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశారు. ఇదిలా ఉండగా అఖిల్‌పై దాడికి పాల్పడిన వారిలో స్థానిక కౌన్సిలర్‌ తపస్‌ బర్మస్‌ను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. అవినీతిపై పోరులో ముందుండటం వల్లే కాంగ్రెస్‌ కక్షకట్టిందని కావలనే హత్యాయత్నం చేశారని అన్నా బృందం సభ్యుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు.

తాజావార్తలు