అఖిల పక్ష సమావేశానికి తప్పకుండా వెళ్తాం : భాజపా
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ నిర్ణయంపై ఢిల్లీలో నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీ ప్రతినిధులు తప్పనిసరిగా వెళ్లనున్నారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శ వీరారెడ్డి చెప్పారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం ఇవాళ ఆ పార్టీ కార్యాలయంలో ప్రారంభమైంది. కీలమైన ఈ సమావేశంలో పార్టీ తరపున రాష్ట్రం నుంచి ఢిల్లీ ఎవరు వెళ్లాలనేది నిర్ణయించనున్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందుగా తమ పార్టీనే తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమని ప్రకటించినట్లు వీరారెడ్డి చెప్పారు. సమావేశం పూర్తయ్యాక కోర్ కమిటీ నిర్ణయాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.