అగ్గిమీద గుగ్గిలం

C

– మరో 8 మంది తెలంగాణ జడ్జీల సస్పెన్షన్‌

– భగ్గుమన్న తెలంగాణ

– రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

– సాముహిక సెలవులో మన న్యాయమూర్తులు

– నేడు చలో హైకోర్టు

హైదరాబాద్‌,జూన్‌ 28(జనంసాక్షి): గత కొన్నిరోజులగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల, న్యాయమూర్తుల నిరసన జడ్జీల సస్పెన్షన్‌తో ఒక్కసారి ఉద్రికత్తంగా మారింది.క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారని పేర్కొంటూ ఎనిమిది మంది న్యాయాధికారులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం ఉపాధ్యక్షులు సున్నం శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్‌ ప్రసాద్‌లతో పాటు మురళీధర్‌, వేణు, రాజు, రమాకాంత్‌, తిరుపతి, రాధాకృష్ణ చౌహాలను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.తెలుగు రాష్ట్రాల మధ్య న్యాయాధికారులను విభజిస్తూ గత నెల 3న ఉమ్మడి హైకోర్టు విడుదల చేసిన ‘ప్రాథమిక కేటాయింపుల జాబితా’ను నిరసిస్తూ తెలంగాణ న్యాయాధికారులు ఆదివారం నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించి.. గవర్నర్‌ నరసింహన్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లారు. దీనిపై సోమవారం హైకోర్టు.. తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, కార్యదర్శి వరప్రసాద్‌లను సస్పెండ్‌ చేసింది. మంగళవారం మరో 8మంది న్యాయాధికారులపై సస్పెన్షన్‌ వేటు వేసింది.

తెలంగాణ వ్యాప్తంగా లాయర్ల విధుల బహిష్కరణ

తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదుల ఆందోళన తీవ్రమయ్యింది. కోర్టులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల నియామకంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోర్టుల వద్ద న్యాయవాదులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలో భాగంగా మంగళవారం కోర్టుల విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సత్వరం హైకోర్టు విభజన చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో అన్ని కోర్టుల వద్దా భారీగా పోలీసలును మొహరించారు.  ఇదిలావుంటే నాంపల్లి కోర్టు ఆవరణలో మంగళవారం ఉదయం న్యాయవాదులు ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల నియామకంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోర్టుల వద్ద న్యాయవాదులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోఉదయం జరిగిన న్యాయవాదుల ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ లాయర్‌ నిద్రమాత్రలు మింగి ఆత్యహత్యకు యత్నించడంతో కోర్టు ఆవరణలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆత్మహత్యకు పాల్పడిన గంప వెంకటేష్‌ అనే న్యాయవాదిని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఇద్దరు జడ్జీల సస్పెన్షన్‌ పై హైకోర్టు వద్ద తెలంగాణ లాయర్ల ఆందోళన కూడా కొనసాగుతోంది. దీంతో హైకోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కోర్టుకు వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతి ఇస్తున్నారు. వరంగల్‌ జిల్లా హన్మకొండలోని జిల్లా కోర్టులో మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల నియామకంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోర్టుల వద్ద న్యాయవాదులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలో భాగంగా మంగళవారం జిల్లా కోర్టులో విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న న్యాయవాదులు ఒక్కసారిగా కోర్టు హాలులోకి చొచ్చుకు వెళ్లి కుర్చీలు, బల్లలు విసిరేసారు. అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు న్యాయవాదులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అతికష్టం విూద పోలీసులు న్యాయవాదులను కోర్టు హాలు నుంచి బయటకు పంపారు. ఆంధ్ర న్యాయమూర్తులకు వ్యతిరేకంగా న్యాయవాదులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పీడియం కోర్టు, మొదటి అదనపు జిల్లా కోర్టులో బెంచీలు, కుర్చీలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఆంద్రా జడ్జెస్‌ గో బ్యాక్‌ అంటూ నినదించారు.  న్యాయాధికారులు మూకుమ్మడిగా సెలవు పెట్టడం, న్యాయవాదులు విధులు బహిష్కరించడంతో తెలంగాణా అంతటా దాదాపు 335 కోర్టుల్లో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. హైకోర్టు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.  కేసులు వాదించే లాయర్లను తప్ప వేరెవ్వరినీ లోపలికి పంపట్లేదు. మొన్నటి దాకా ఐడెంటిటీ కార్డు చూపితే లోనికి అనుమతించేవారు. ఇవాళ అది కూడా జరగడం లేదు. లాయర్లు తమ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపితేనే అనుమతిస్తున్నారు. లాయర్ల ఆందోళనతో హైకోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివిధ జిల్లా కోర్టుల్లో కూడా కార్యకలాపాలు నిల్చిపోయాయి. లాయర్లు నిరసన ప్రదర్శనలు తీస్తున్నారు. ధర్నా చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంత మూలాలున్న న్యాయాధికారులను తెలంగాణా కోర్టుల్లో నియమించడాన్ని నిరసిస్తూ జడ్జీలు కొద్ది వారాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన బాట పట్టి హైకోర్ట్‌ విూదే విమర్శలు గుప్పించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఇద్దరు న్యాయమూర్తులను సస్పెండ్‌ చేసింది. దీంతో ఆందోళనను ఉద్ధృతం చేశారు జడ్జీలు. ప్రస్తుతం న్యాయాధికారులు భవిష్యత్‌ కార్యాచరణపై ఓ ¬టల్‌ లో సమావేశమై చర్చిస్తున్నారు.

సామూహిక సెలవులో తెలంగాణ న్యాయమూర్తులు

ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు విభజన ఆందోళన ఉధృతం దాల్చింది.  జడ్జిల సస్పెన్షన్‌పై వీరు మండిపడుతున్నారు. దీంతో సామూహిక సెలవులో వెల్లాలని నిర్ణయించారు.  తెలంగాణ న్యాయమూర్తులు, న్యాయవాదులు హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తోన్నారు. ఈమేరకు పలు సందర్బాల్లో ఆందోళనలో పాల్గొన్న పదకొండు మంది న్యాయమూర్తులపై హైకోర్టు సస్పెన్షన్‌ వేటు వేసింది. దీంతో జడ్జిలు, న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. సస్పెన్షన్‌కు గురైన జడ్జిలపై వెంటనే సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ మూకుమ్మడి సెలవుపై వెళ్లాలని వందమందికిపైగా న్యాయమూర్తులు నిర్ణయించారు. కాగా, ఛలో రాజ్‌భవన్‌ ఆందోళనకు కారణమైన ఇద్దరు న్యాయమూర్తులు కే రవీందర్‌రెడ్డి, వరప్రసాద్‌లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా మరో తొమ్మిది మంది జడ్జిలు న్యాయాధికారుల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖరప్రసాద్‌, రమాకాంత్‌, తిరుపతి, రాధాకృష్ణ చౌహాన్‌, సరిత, వేణు, రాజు, మురళీధర్‌ను సస్పెండ్‌ చేస్తూ  మంగళవారం ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపోతే న్యాయాధికారుల కేటాయింపుల విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ న్యాయాధికారులు మరోసారి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ను కలవనున్నారు. మరోవైపు సహచర న్యాయాధికారులు, సంఘం అధ్యక్ష, కార్యదర్శులను సస్పెండ్‌ చేయడంపై న్యాయాధికారులు మండిపడుతున్నారు. దీనిపై చర్చించేందుకు మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో 15 రోజులపాటు సామూహిక సెలవులు పెట్టాలని తెలంగాణ న్యాయాధికారుల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో  సస్పెన్షన్‌కు గురైన జడ్జిలపై వెంటనే సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ 200 మంది న్యాయాధికారులు మూకుమ్మడిగా సెలవులపై వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా  సర్వీసు నిబంధనలు, ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారంటూ తెలంగాణ న్యాయాధికారులపై హైకోర్టు కన్నెర్ర చేసింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రవీందర్‌రెడ్డి, వి.వరప్రసాద్‌లతో పాటు మరో తొమ్మిది మందిపై  సస్పెన్షన్‌ వేటు వేసింది.ఇదిలా వుండగా  కేసీఆర్‌ చేతిగానితనం వల్లే హైకోర్టు విభజన కాలేదని, న్యాయమూర్తులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్‌ నేత, కరీంనగర్‌ మాజీ ఎంపి  పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజనపై కేసీఆర్‌, చంద్రబాబు ఎందుకు మాట్లాడుకోవడంలేదని ప్రశ్నించారు. గత రెండేల్లుగా సిఎం కెసిఆర్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బార్‌ అసోసియేషన్‌ టీఆర్‌ఎస్‌ తొత్తుగా పనిచేస్తోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నేతలను కలుస్తున్న బార్‌ అసోసియేషన్‌ నేతలు మిగతా పార్టీలను ఎందుకు కలవడంలేదని ప్రశ్నించారు. హైకోర్టు విభజనపై ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కేసీఆర్‌ అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. కేవలం ఎంపి వినోద్‌ను కలిసి బార్‌ అసోసియేషన్‌ సభ్యులు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని కలవడం ఏం న్యాయమన్నారు. ఇదేమన్నా ఇంటి సమస్యా అని అన్నారు. చంద్రబాబుతో టచ్‌లో ఉన్న కెసిఆర్‌ హైకోర్టు విషయంలో ఎందుకు మాట్లాడరని అన్నారు. మంచి జరిగితే పాలభిషేకాలు చేయించుకోవడం లేకుంటే, ఇతర పార్టీలను నిందించడం కెసిఆర్‌కు అలవాటయ్యిందన్నారు. కేసీఆర్‌ అసమర్థత వల్లే హైకోర్టు విభజన జరగడం లేదని పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబును హైకోర్టు విభజనకు ఒప్పించడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని విమర్శించారు. అందువల్లే న్యాయవాదులు రోడ్డుకెక్కాల్సి పరిస్థితి వచ్చిందన్నారు. హైకోర్టు కోసం ఢిల్లీలో దీక్ష చేపడుతానంటున్న సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే.. ఆ డిమాండ్‌ నెరవేరాకే తిరిగి రాష్ట్రానికి  రావాలని సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ తొత్తుగా బార్‌ అసోసియేషన్‌ మారిందని విమర్శించారు. విూలో చిత్తశుద్ధి ఉంటే ఛలో సెక్రటేరియట్‌, ఛలో క్యాంప్‌ ఆఫీస్‌.. ఛలో టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌కు పిలుపునివ్వాలని బార్‌ అసోసియేషన్‌కు సవాల్‌ విసిరారు. హైకోర్టు విభజన, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి వెంటనే అఖిలపక్షాన్ని న్యూఢిల్లీకి తీసుకెళ్లాలని కేసీఆర్‌ను పొన్నం డిమాండ్‌ చేశారు. న్యాయవాదులు నిరసనలు చేపట్టవద్దంటూ జారీ చేసిన మెమోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.