అగ్నిప్రమాదంలో రూ.3 లక్షల ఆస్తినష్టం

విజయవాడ, జూలై 29 : కలిదిండిలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించగా నాలుగు ఇండ్లు తగలబడ్డాయి. ఆస్తినష్టం మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఒక ఇంట్లో గ్యాస్‌ లీకై అంటుకున్న మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఇరుగుపొరుగు నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మంటలు అంటుకోగానే ఆయా ఇళ్లల్లోని వారు బయటకు వచ్చేయడంతో ప్రమాదం తప్పింది. ఆస్తినష్టం మాత్రం వాటిల్లింది.