అగ్నిప్రమాదంలో సజీవదహనమైన బాలుడు
ఆదిలాబాద్, జనంసాక్షి: తానూరు మండలం కళ్యాణిలో అగ్నిప్రమాదం జరిగింది. గడ్డివాముకు నిప్పంటుకుని పక్కనే ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి. అయితే ఓ ఇంటిలో ఉన్న ఏడాదిన్నర బాలుడు సజీవదహనమయ్యాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.