అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన – శాసన సభ్యుడు డిఎస్ రెడ్యానాయక్

సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం.

డోర్నకల్, సెప్టెంబర్-6, జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన డోర్నకల్ శాసనసభ్యుడు డిఎస్ రెడ్యానాయక్. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక కేంద్రం డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయడం వల్ల మండలంలోని గ్రామాల్లో ఎలాంటి అగ్ని మాపక ప్రమాదాలు సంభవించినా వాటిని అధిగమించేందుకు దోహద పడుతుందని, డోర్నకల్ మండలంలోని గ్రామాలకు మాత్రమే కాకా గార్ల, సీరోల్ మండలాలలోని గ్రామాలలో కూడా ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నియోజకవర్గంలోని మరిపెడ మున్సిపాలిటీ తో పాటు డోర్నకల్ మున్సిపాలిటీ కూడా సమానంగా చూస్తున్నామని సీఎం కేసీఆర్ హయాంలోని అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే రెడ్యా అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుందని రాష్ట్రంలో ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకం అందుతుందని రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని శాసనసభ్యుడు డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ టీ వెంకన్న, మానుకోట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్, స్థానిక మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, ఎంపీడీవో చలపతిరావు, తాసిల్దార్ నాగ భవాని, ఎస్ఎఫ్ఓ నాగేశ్వరరావు,ఎల్ఎఫ్ఓ లు చంద్రమౌళి,శ్రీనివాస్, ఫైర్ మేన్ లు రాజేష్,మహేష్ సిబ్బంది లు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, వార్డ్ కౌన్సిలర్ లు పోటు జనార్ధన్, పర్వీన్ సుల్తానా, కో ఆప్షన్ మెంబర్లు, సర్పంచ్ పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.