అగ్ని ప్రమాదంలో చిన్నారి సజీవదహనం
తానూర్: మండలంలోని కల్యాణి గ్రామంలో గురువారం ఉదయం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒక ఇల్లు, పాకశాల దగ్ధం అయ్యాయి. ఈ సంఘటనలో ఇంట్లో ఉన్న ఏడాది వయస్సున్న అంకిత్ అనే చిన్నారి మృతి చెందాడు. బాలుడి నాయనమ్మ ఆనందబాబు పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను 108 వాహనంలో భైంసాకు తరలించారు. భైంసా అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.