అగ్ని ప్రమాదం వల్ల 12 ఇళ్లు పూర్తిగా దగ్థమయ్యాయి రూ.20లక్షల ఆస్తి నష్టం
వేలేరుపాడు: మండలంలోని రేపాక గొమ్మలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 12 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ.20లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఉదయం పది గంటల ప్రాంతంలో తెల్లం వెంకటరమణ ఇంటిలో షార్ట్ సర్య్కూట్ జరిగి మంటలు వ్యాపించాయి. ఈ మంటలు చుట్టు పక్కన ఉన్న ఇళ్లకు కూడా అంటుకున్నాయి. ప్రమాదంలో పన్నెండు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ సిబ్బందికి ఒక్కో కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 5000 నిత్యవసర సరకులు అందజేశారు.