అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం
– ఉన్మాది కాల్పుల్లో 13 మంది మృతి
హైదరాబాద్ అక్టోబర్2(జనంసాక్షి):
అమెరికాలోని ఒరెగన్ స్టేట్ ఉంప్‌క్వా కళాశాలలో ఉన్మాది కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 13మంది మృతిచెందగా, 20మందికి పైగా గాయాలయ్యాయి. సమాచార మందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని కాల్పులకు పాల్పడిన ఉన్మాదిని హతమార్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉప్‌క్వా కళాశాలలో దాదాపు 3వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కాల్పుల ఘటనతో కళాశాల తరగతిగదులన్నీ రక్తసిక్తమయ్యాయి. ఘటన అనంతరం కళాశాల మూసివేశారు. ఉన్మాది కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర దిగ్బ్రాంతి వక్తం చేశారు.