అజర హాస్పిటల్ లో బతుకమ్మ వేడుకలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 29(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని ములుగు రోడ్డులో గల అజర హాస్పిటల్ లో బుధవారం సాయంత్రం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హాస్పటల్లోని మహిళా సిబ్బంది తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ వేడుకలను ఆడి పాడి ఉత్సాహంగా నిర్వహించారు. ప్రతి ఏటా బతుకమ్మ వేడుకలను హాస్పిటల్లో నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంలో భాగంగా ఇలా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
2 Attachments • Scanned by Gmail