-అజాగ్రత్తతో వాహనాలు నడిపి కుటుంబాలను అనాధలు గా మార్చకండి.

-ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలి.
-జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత.
-కోర్టులో వాహన ప్రమాదాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
-జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వరూప.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 3(జనంసాక్షి):
అన్ని రకాల వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని, అజాగ్రత్తతో వాహనాలను నడిపి ప్రాణాలను కోల్పోయి తమపై ఆధారపడ్డ కుటుంబాలను అనాధలుగా మార్చకండని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జి.సబిత జిల్లా పౌరులకు పిలుపునిచ్చారు.పౌరులకు ట్రాఫిక్ నియంత్రణ చట్టాలపై అవగాహన కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు నుండి గాంధీ పార్క్ వరకు ర్యాలీని నిర్వహించారు.అనంతరం అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ…. వాహనాలను ట్రాఫిక్ చట్టాల లోబడి మాత్రమే వాహనాలను నడిపించాల న్నారు.  ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, సీటు బెల్ట్‌ ధరించి వాహనం నడుపాలన్నారు.సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ మద్యం తాగి డ్రైవింగ్‌ చేయరాదని, ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణించరాదని,రాంగ్‌ రూట్‌లో వాహనాలు నడుపవద్దని సూచించారు.
ట్రాఫిక్‌ జంక్షన్‌ల వద్ద  సిగ్నల్స్‌ జంప్‌ చేయవద్దని, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపరాదని, సూచించారు.
మైనర్లకు వాహనాలను ఇచ్చి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తప్పనిసరిగా వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ పత్రాలు వాహనాలో అందుబాటులో ఉండాలన్నారు.
ప్రమాదాలు జరిగినాక బాధపడకుండా, ప్రతి ఒక్కరూ వాహనాలను ట్రాఫిక్ రూల్స్ ప్రకారం నడిపి తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కాపాడాలి అన్నారు.2019 వాహన చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చట్టాలకు లోబడి వాహనాల నడపాలని చట్టాలను అతిక్రమించిన వారికి భారీ పెనాల్టీలు విధిస్తున్నామన్నారు.
ప్రమాదాలకు గురి అయ్యి వారు చట్టపరంగా నష్ట నివారణ కింద న్యాయం పొందవచ్చు అన్నారు.
కోర్టులో వాహన ప్రమాదాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వరూప :
 
జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వరూప మాట్లాడుతూ…
2021లో  కంటే 2022 సంవత్సరంలో వాహన ప్రమాదాల కేసులు కోర్టులో అధికంగా నమోదయాయని ఆమె తెలిపారు.ట్రాఫిక్ చట్టాలను అతిక్రమించి అజాగ్రత్త అతివేగంతోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
మద్యం తాగి వాహనాల నడిపే వారి పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాల న్నారు.అదేవిధంగా ప్రభుత్వాలు కూడా రహదారులను ప్రమాద రహితంగా ఉండేలా కృషి చేయాలన్నారు.పట్టణాల్లో తప్పనిసరిగా వాణిజ్య సముదాయాల ముందు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని, వాహనాలను క్రమ పద్ధతిన పార్కింగ్ చేసేలా పోలీసు వారు చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కాపాడుతూ కుటుంబాలతో సంతోషంగా గడిపేలా వాహనదారుల చర్యలు ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, ఆర్టిఓ ఎర్రి స్వామి, జర్నల్ సెక్రెటరీ పర్వత్ రెడ్డి, సీఐ హనుమంతు, ఎస్సై విజయ్ కుమార్, జిల్లా కోర్టు సిబ్బంది, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు బార్ అసోసియేషన్ సభ్యులు, పోలీస్ ఆర్టిఏ శాఖల సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.