అజ్జమర్రి పాఠశాలలో గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమం.

చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమం తొలిమెట్టులో భాగంగా మండలంలోని అజ్జమర్రి ప్రాథమిక పాఠశాలను మండల ఎస్ ఎల్ ఎన్ టీం పర్యవేక్షించడం జరిగింది. దీనిలో భాగంగా చిలప్ చేడ్ మండల నోడల్ అధికారి విటల్ సార్ అలాగే మండల ఎఫ్ ఎల్ ఎన్ ఆర్ పి లు ప్రతి విద్యార్థి యొక్క స్థితిని పరీక్షించడం జరిగింది మరియు పాఠశాలలో లెసన్ ప్లాన్స్ పిరియడ్ ప్లాన్స్ తో పాఠాలు బోధించడం విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు నమోదు చేయడం వంటి రిజిస్టర్ లను పరీక్షించారు ప్రతిపాటాన్ని బోధన సామాగ్రితో బోధించాలని సూచించారు నాలుగవ తరగతిలో ఎం శివగణేష్ విద్యార్థి ప్రతిభను గమనించి నోడల్ అధికారి నగదు బహుమతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎల్ ఎన్ ఆర్ పి లు శ్రీనివాస్ సునీల్ శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్ ఉపాధ్యాయులు వెంకటకృష్ణ కనకయ్య ఎస్.కె మదర్ లు పాల్గొన్నారు