అట్టహాసంగా భద్రాద్రి రాములోరి కల్యాణం
– ముత్యాల తలంబ్రాలు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేేసీఆర్
– తరలివచ్చిన భక్త జనం
భద్రాచలం,ఏప్రిల్ 15(జనంసాక్షి): ఖమ్మం జిల్లా భద్రాచలంలో వేంచేసిన శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం కన్నుల పండువగా అత్యంత వైభవంగా సాగింది. వేదపండితుల మంత్రోఛ్ఛరణాల మధ్య, వేదపండితుల సమక్షంలో సిఎం కెసిఆర్, ఇతర మంత్రులు వీక్షిస్తుండగా స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితులు రాముడి గుణగణాలను కీర్తిస్తూ కళ్యాణోత్సవ విశేషాలను వివరిస్తూ చేపట్టిన కళ్యాణం ఆద్యంతం కన్నుల పండవుగా సాగింది. సిఎం కెసిఆర దంపతులు, కేంద్రమంత్రి దత్తాత్రేయ, మంత్రులు తుమ్మల నాగేశ్ర రావు, కడియం శ్రీహరి,ఇంద్రకరణ్‌రెడ్డి,దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు సీతరాం నాయక్, బాల్క సుమన్ తదితరులు మంటపంలో వేంచేసి ప్రత్యక్షంగా ఈ వైభవాన్ని తిలకించారు. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. మిథిలా మండపంలో స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా వేదోక్తంగా సాగింది. అశేష భక్తజనం మధ్య మిథిలా స్టేడియంలో కన్నుల పండువగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అత్యంత వైభవోపేతంగా జరిగిన కల్యాణమ¬త్సవాన్ని తిలకించేందకు తెలుగు రాష్టాల్రతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్టాల్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. తొలుత ఆలయంలో ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించిన తర్వాత.. మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా సీతారాములు పల్లకీలో కల్యాణ మండపానికి వేంచేశారు. వేదపండితులు తిరుకల్యాణానికి సంకల్పం చేసి సర్వవిజ్ఞాన శాంతికి విష్వక్సేనుని పూజించారు. అనంతరం కల్యాణ క్రతువులో ఒక్కో ఘట్టాన్ని వివరిస్తూ అర్చక పండితులు కల్యాణ మ¬త్సవాన్ని నిర్వహించారు. మంగళవాయిద్యాలు మార్మోగుతుండగా వేదమంత్రోచ్చరణల నడుమ అభిజిత్ లగ్నం సవిూపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. అశేష భక్తజనం రామనామం జపిస్తుండగా… వేదపండితులు సీతమ్మవారికి మాంగల్యధారణ గావించారు. భక్త రామదాసు చేయించిన మంగళ పతకాన్ని కలిపి ధరింపజేయడం ఈ క్షేత్ర ఆచారం.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కల్యాణమ¬త్సవానికి హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేశ నలుమూల నుంచి తరలివచ్చిన భక్తులతో భద్రాద్రి భక్త జనసంద్రంగా మారింది. జైశ్రీరామ్ నినాదాల మధ్య ప్రశాంతగా కళ్యాణవేడుకలు జరిగాయి. మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణ క్రతువు వైభవంగా సాగింది. వేద పండితుల మంత్రోశ్ఛరణల మధ్య కన్నుల పండువగా సాగుతున్న కల్యాణ క్రతువును వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. తొలుత ఆలయంలో ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించిన తర్వాత.. మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా సీతారాములు పల్లకీలో కల్యాణ మండపానికి వేంచేశారు. వేదపండితులు తిరుకల్యాణానికి సంకల్పం చేసి సర్వవిజ్ఞాన శాంతికి విష్వక్సేనునిపూజించారు. సంప్రదాయ బద్ధమైన అన్ని పూజాది విధుల్లో విష్వక్సేనుకి పూజలు చేశారు. మధ్యాహ్నం 12.30గంటల వరకు సీతారాముల కల్యాణం కల్యాణం జరిగింది. స్వామివారి కల్యాణ క్రతువును ప్రతి ఒక్కరూ వీక్షించారు. జగత్ కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు పోటీ పడ్డారు. కల్యాణమూర్తులను సుందరంగా అలంకరించి… కల్యాణ మండపానికి స్వామివారి ఊరేగింపు
ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.30గంటల వరకు సీతారాముల కల్యాణ మ¬త్సవం వైభవోపేతంగా సాగింది. ఓ వైపు భద్రాచలంలో రాములోరి పెళ్లి సందడి ,శ్రీరామనామస్మరణతో పుణ్య గోదావరి తీరం మార్మోగింది. ఉత్సవ విగ్రహాలను కల్యాణ మండపానికి సీతారాముల దివ్యమూర్తులను మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణంచేపట్టారు. కల్యాణ మ¬త్సవానికి సీఎం కేసీఆర్ హాజరు కావడం ఇది రెండోసారి. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను కేసీఆర్ సమర్పించారు.మిథిలా మంటపాన్ని రాముల వారి కల్యాణం కోసం సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో పాటు భద్రచలం అంతటా భక్తులతో సందడిగా నెలకొంది. విద్యుద్దీపలంకరణతో పట్టణం అంతటా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సిఎం కెసిఆర్‌కు స్వాగతం
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఖమ్మం జిల్లా భద్రాచలం చేరుకున్నారు. పొగాకు బోర్డులోని హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ లోకేశ్‌కుమార్, ఐజీ నవీన్‌చంద్ పలువురు తెరాస నేతలు స్వాగతం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా భద్రాచలం చేరుకున్నారు.




