అట్రాసిటీ కేసులలో బాధితులకు అండగా అధికారులు నిలవాలి

– మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): అట్రాసిటీ కేసులలో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత అధికారులకు ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజమైన ఫిర్యాదుదారుడైతే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు.చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.నిజమైన ఫిర్యాదుల పట్ల ఆలస్యం చేసిన పోలీసు అధికారులపై గతంలో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.బాధితులు వచ్చిన వెంటనే కేసును విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ప్రజలందరూ సోదర భావంతో మెలగాలని సూచించారు.మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ చట్టాల పట్ల అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.కేసుల పట్ల పోలీస్ అధికారులు విచారణ వేగవంతంగా జరపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ,ఎస్సీ కులాల అభివృద్ధి అధికారిణీ దయానందరాణి , ఏడి ఎస్సి కార్పొరేషన్ బి.శిరీష, జిల్లా షెడ్యూల్ తెగల అభివృద్ధి అధికారి కె.శంకర్, మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ , రెవెన్యూ డివిజనల్ అధికారులు రాజేంద్ర కుమార్, కిషోర్ కుమార్ , వెంకారెడ్డి , విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సిహెచ్.చిన్న శ్రీరాములు, గుడిపాటి సైదులు , భూక్య రవి , ఎస్.ప్రకాష్ బాబు, జి.అచ్చమ్మ , ఎన్జీవో మెంబర్ ఎల్.భద్రయ్య , అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు