అడవుల రక్షణకు తొలి ప్రాధాన్యం

ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు

జగిత్యాల,జనవరి31(జ‌నంసాక్షి): రానున్న ఐదేళ్లు పచ్చదనం పెంపు, అడవుల రక్షణ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశంగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కఠినంగా వ్యవహరిస్తామని డీఎఫ్‌వోనరసింహా రావు అన్నారు.

జిల్లావ్యాప్తంగా అన్ని కలపకోత యంత్రాలపై నిఘా ఉంచుతామనీ, తప్పనిసరిగా వారందరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అడవిని కాపాడడం,అడవులను పునరుద్ధరించడం లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. విధుల్లో అటవీ సిబ్బంది నిర్లక్ష్యం చేయవద్దని, ఏ స్థాయి వారైనా చర్యలు తప్పవన్నారు. ప్రతి అటవీ సిబ్బంది తప్పనిసరిగా తమ పరిధి ప్రాంతంలో క్షేత్రపర్యటన చేయాలన్నారు.

అటవీ సంరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొ న్నారు. అటవీ సంరక్షణకు కఠినంగా వ్యవహరించాలనీ, అటవీ నేరాలను అదుపులో పెట్టాలని అధికారులను ఇప్పటికే సిఎస్‌ ఎస్‌కె జోషి ఆదేశించారు. అటవీ నేరాల నివారణ, కఠిన శిక్షణ ఖరారులో మరింత వేగం పెంచుతామనీ అన్నారు.

కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామనీ, కొట్టేసిన కలపను పట్టుకోవడం కాకుండా అడవిలోకి నేరస్తులు వెళ్లకుండా చూస్తామని అన్నారు. అడవులపై నిరంతరం నిఘా కోసం సాయుధ పోలీసుల పహారా ఉంటుందన్నారు. గ్రామస్థాయిలో హరిత రక్షక కమిటీలు ఏర్పాటు ఏర్పాటు చేస్తామన్నారు. స్మగ్లర్లను

అడ్డుకునేందుకు ఎక్కడెక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయాలనే యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసి సమాచారాన్ని పంపుతామన్నారు.